హరిత.. హరం | - | Sakshi
Sakshi News home page

హరిత.. హరం

Aug 4 2025 3:14 AM | Updated on Aug 4 2025 3:14 AM

హరిత.

హరిత.. హరం

జిల్లాకేంద్రంలో యథేచ్ఛగా చెట్ల నరికివేత

అటవీశాఖ నిర్లక్ష్యం..

వృక్షాల తొలగింపులో అధికారులు ఏ మాత్రం నిబంధనలు పాటించడం లేదు. భారీ చెట్లను సంరక్షించేందుకు కృషి చేయాలే తప్పా అడ్డగోలుగా నరికివేయడం సరికాదు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

– తిరుమల్‌, మాజీ కౌన్సిలర్‌

భారీ వృక్షాలను

తొలగించారు..

మున్సిపాలిటీ పార్క్‌ను సొంత పార్క్‌లా భావించి అభివృద్ధి చేశాం. 25 ఏళ్ల కిందట నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. దీనికితోడు పచ్చదనం కూడా అదేస్థాయిలో పెంపొందించాం. ఏం జరిగిందో తెలియదుగానీ ఉన్నఫలంగా చెట్లను నరికివేశారు. ఎలాంటి ఇబ్బంది లేకపోయినా నరికివేయడం సరికాదు.

– డా. ఎల్‌.మురళీధర్‌, వనపర్తి

మౌఖిక ఆదేశాలతోనే..

చెట్ల తొలగింపునకు అటవీశాఖ అనుమతి తీసుకోవాలని సిబ్బందికి సూచించాం. కొన్ని చెట్ల తొలగింపులో మౌఖిక ఆదేశాలతో ముందుకెళ్లాం. జిల్లాకేంద్రంలో లక్ష మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం.

– ఎన్‌.వెంకటేశ్వర్లు, పుర కమిషనర్‌, వనపర్తి

ఎక్కడెక్కడ తొలగించారు..

చెట్లు ఎక్కడెక్కడ తొలగించారో ఫొటోలు ఉంటే అందించండి.. కొన్ని నా దృష్టికి వచ్చాయి. చలానా చెల్లిస్తే ఆన్‌లైన్‌లో అనుమతి లభిస్తుంది. ప్రతినెల ఎన్ని అనుమతులు తీసుకున్నారని సమీక్షిస్తుంటాం. రెండు, మూడు నెలల్లో ఎన్ని వచ్చాయో గుర్తుకు లేదు.

– అరవింద్‌రెడ్డి,

జిల్లా అటవీశాఖ అధికారి

వనపర్తిటౌన్‌: పర్యావరణ పరిరక్షణకు పచ్చదనాన్ని పెంపొందించాలంటూ ప్రభుత్వం ఓ వైపు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపడుతూ రూ.కోట్లు వెచ్చిస్తుండగా.. మరోవైపు ఏపుగా పెరిగిన వృక్షాలను అక్రమంగా తొలగిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని అంతర్గత, ప్రధాన రహదారుల పరిసరాలు, పార్క్‌ల్లో 3 నెలలుగా వృక్షాల తొలగింపు యథేచ్ఛగా కొనసాగుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.500 చలానా తీసి అటవీ అధికారులను సంప్రదించి వృక్షాలను తొలగించాలి. ట్రీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ (పునర్జీవం) ద్వారా ఓ ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి చెట్లను తరలించి రసాయనాల ద్వారా నాటి సంరక్షిస్తారు. దీంతో పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు వృక్షసంపదను కాపాడినట్లు అవుతుంది. పట్టణాభివృద్ధి దృష్ట్యా ఐదేళ్ల కిందట ఇలాంటి సమస్య ఎదురైతే చెట్లను ట్రీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ద్వారా నాగవరం ప్రాంతంలో పరిరక్షించారు. ప్రస్తుతం జిల్లాకేంద్రంలో కలెక్టర్‌, జిల్లా అటవీశాఖ అధికారులు ఉన్నా.. రాజకీయ పార్టీల నేతల ప్రోద్భలంతో యథేచ్ఛగా చెట్లను కొట్టేస్తున్నారు. మూడు నెలలుగా ఈ తతంగం కొనసాగుతున్నా అటవీశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విస్మయం కలిగిస్తోంది.

నిబంధనలకు తూట్లు..

ప్రభుత్వ నిబంధనల మేరకు సీసీ రహదారి నిర్మాణంలో రహదారికి ఇరువైపులా మొక్కల పెంపకానికి స్థలం వదలాల్సి ఉంటుంది. పుర కేంద్రంలో అంతర్గత రహదారులను సీసీగా మారుస్తుండగా ఆ నిబంధనలను పూర్తిగా విస్మరించారు. గుత్తేదారుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం, స్థానికుల ప్రోద్భలంతో వీధులన్నీ సిమెంట్‌మయంగా మారాయి. కొన్నిచోట్ల వృక్షాలను సైతం తొలగించి రోడ్డు నిర్మించారు. దీంతో కాలనీల్లో పచ్చదనం కరువైంది.

జిల్లాకేంద్రంలోని గాంధీనగర్‌, బాలానగర్‌, పానగల్‌ రోడ్‌, వేంకటేశ్వరస్వామి ఆలయం తదితర ప్రాంతాల్లో మూడునెలల కాలంలో పెద్ద సంఖ్యలో వృక్షాలు నేలకొరిగాయి. 25 ఏళ్ల కిందట ప్రజా వైద్యశాల పార్క్‌లో మొక్కలు నాటగా అవి ఏపుగా పెరిగాయి. పార్క్‌ నిర్వహణను పుర అధికారులు పట్టించుకోకపోవడంతో వైద్యులు డా. మురళీధర్‌, శారద పరిరక్షించారు. పార్క్‌ ప్రహరీ వెలుపల ఉన్న నివాసాలు దెబ్బతింటున్నాయని కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించి చెట్లను విచ్ఛలవిడిగా తొలగించారు.

రోడ్డుకు అడ్డుగా లేకపోయినా

తొలగింపు

నాయకుల ఒత్తిళ్లతో మిన్నకుంటున్న అధికారులు

కన్నెత్తి చూడని అటవీ అధికారులు

హరిత.. హరం1
1/4

హరిత.. హరం

హరిత.. హరం2
2/4

హరిత.. హరం

హరిత.. హరం3
3/4

హరిత.. హరం

హరిత.. హరం4
4/4

హరిత.. హరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement