
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో రజత పతకం
వనపర్తిటౌన్: హన్మకొండలోని జేఎన్ మైదానంలో కొనసాగుతున్న 11వ రాష్ట్రస్థాయి జూనియర్, సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఆదివారం జిల్లాకు చెందిన బద్దూనాయక్ ఐదు వేల మీటర్ల పరుగు పందెం పోటీలో రెండోస్థానంలో నిలిచి రజత పతకం సాధించారు. రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్టాలిన్ పతకాన్ని అందజేశారు. జిల్లా క్రీడాకారులు రజత పతకం సాధించడంతో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్, ప్రతినిధులు నర్సింహ, ఆంజనేయులు, సంఘం కార్యదర్శి సారంగపాణి, కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, జనరల్ సెక్రెటరీ నందిమళ్ల శ్రీకాంత్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
భార్గవికి 6 బంగారు
పతకాలు
వనపర్తిటౌన్: ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పట్టణానికి చెందిన యాదగిరిచారి, విజయ హైమావతి దంపతుల కుమార్తె భార్గవిచారి అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసింది. ఆదివారం యూనివర్సిటీలో జరిగిన 55వ స్నాతకోత్సవంలో ఓవరాల్ క్యాటగిరిలో 4, ఫామ్ మిషనరీ, ఫుడ్ ప్రాసెసింగ్‌లో రెండు 2 మొత్తం 6 బంగారు పతకాలు సాధించింది. గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ భార్గవికి గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఐసీఏఆర్ ఢిల్లీ డా. మంగిలాల్ జాట్, వైస్ ఛాన్స్‌లర్ ప్రొ. అల్డాస్ జానయ్య, యూనివర్సిటీ ప్రముఖులు పాల్గొన్నారు.
బీచుపల్లి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
ఎర్రవల్లి: మండలంలోని బీచుపల్లి అభయాంజనేయస్వామి ఆలయాన్ని ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, మాజీ ఎంపీ రాములు వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ ఈఓ రామన్‌గౌడ్ వారిని శేషవస్త్రాలతో సత్కరించగా.. అర్చకుడు మారుతిచారి తీర్థ ప్రసాదాలు అందించి ఆలయ విశిష్టతను వివరించారు. వారి వెంట ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
సమాజ మార్గదర్శి గురువు : ఎమ్మెల్సీ
వనపర్తి విద్యావిభాగం: తరతరాలుగా సమాజానికి మార్గదర్శిగా ఉంటూ విద్యార్థులను తీర్చిదిద్దిన వ్యక్తి గురువని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి కొనియాడారు. తపస్ వనపర్తి జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గురువందనం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జిల్లాలోని 45 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేసి మాట్లాడారు. గురువులు అందించిన విద్యే తన అభివృద్ధికి బాటలు వేసిందని తెలిపారు. అనంతరం ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ కార్యవాహ పత్తికొండ రాము మాట్లాడుతూ.. భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ప్రముఖమైందన్నారు. కార్యక్రమంలో తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంత్‌రావు, జిల్లా అధ్యక్షుడు వేముల అమరేందర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్, జిల్లా గౌరవ అధ్యక్షురాలు కరుణ, మండల విద్యాధికారి మద్దిలేటి, అకాడమిక్ మానిటరింగ్ అధికారి మహానంది, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు వరప్రసాద్‌గౌడ్, జిల్లా మీడియా కన్వీనర్ దామోదర్‌రెడ్డి, శశివర్ధన్, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో రజత పతకం

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో రజత పతకం

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో రజత పతకం