
అమ్మ.. నాన్న.. ఫ్రెండ్
స్నేహమంటే ఇదేరా !
ఆదివారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2025
● తల్లిదండ్రుల తర్వాత స్నేహితులకే
ప్రాధాన్యం
● మధురమైన జీవితంలో
స్నేహబంధం
మరుపురానిదని కితాబు
● మంచి స్నేహితులు ఒక్కరు
చాలంటున్న యువత
● మారుతున్న పరిస్థితుల్లో
విలువలు
దిగజారుతున్నాయని
ఆవేదన
‘స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా.. కడదాక నీడ లాగ నిను వీడిపోదునురా.. నీ గుండెలో పూచేటిదీ, నీ శ్వాసగా నిలిచేటిదీ ఈ స్నేహమొకటేనురా..’
..స్నేహం గురించి తెలిపేలా ఓ కవి రాసిన మధుర గీతమిది. చిన్ననాటి నుంచి మొదలు చరమాంకం వరకు తీపి గుర్తులుగా మదిలో నిలిచేది స్నేహ బంధం. అందుకే జీవితంలో మధురమైనది, మరపురానిది అంటే స్నేహమేనని చెబుతారు. కాలంతో పాటు మారిన జీవన పరిస్థితుల్లో సైతం ఫ్రెండ్‌షిప్ అనేది యువత ఉన్నతిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ మేరకు వారు ఏం కోరుకుంటున్నారు.. ఎలాంటి నేస్తం కావాలి.. వారికి మీరిచ్చే స్థానం ఏమిటి ? వంటి తదితర అంశాలపై ‘సాక్షి’ ఒక చిన్న ప్రయత్నం చేసింది. నేడు స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా సర్వే నిర్వహించింది. తల్లిదండ్రుల తర్వాత స్నేహితులకే ప్రాధాన్యం అంటూ యువతీ యువకులు ఉత్సాహంగా తమ అభిప్రాయాలను వెల్లడించారు.
– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
న్యూస్‌రీల్
సర్వే ఇలా..

అమ్మ.. నాన్న.. ఫ్రెండ్