
అందుబాటులోకి ఆధునిక వృత్తివిద్య కోర్సులు
వనపర్తి: ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో ప్రస్తుతం డిమాండ్ ఉన్న వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయని.. ఆసక్తిగల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ) నెలకొల్పి వాటిలో ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టిందన్నారు. ఈ ఆధునిక వృత్తి విద్య కోర్సుల్లో రెండోవిడత ప్రవేశాలు ప్రారంభమయ్యాయని.. జిల్లాలో మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ (40 సీట్లు), మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ (24 సీట్లు), బేసిక్ డిజైనర్ మరియు వర్చువల్ వెరిఫైర్ మెకానికల్ (24 సీట్లు), ఆర్టిసన్ యూజింగ్ అడ్వాన్స్‌డ్ టూల్ (20 సీట్లు), అడ్వాన్స్‌డ్ సీఎంసీ మిషన్ టెక్నీషియన్ (24 సీట్లు), ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ (40 సీట్లు) ఉన్నాయని వివరించారు. వీటితో పాటు రెగ్యులర్ కోర్సులైన ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్‌మెన్, సీఓపీఏ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని చెప్పారు. దరఖాస్తునకు 31వ తేదీ వరకు గడువు ఉందని.. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ http://iti.telangana.gov.in, లేదా సెల్‌నంబర్ 94902 02037, 98492 44030, 79953 35372 సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ రమేష్, టీగెట్ చంద్రశేఖర్‌గౌడ్, ఏఎల్‌ఓ వేణుగోపాల్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.