
ప్రశాంతంగా ముగిసిన జీపీఓ రాత పరీక్ష
వనపర్తి: గ్రామపాలన అధికారి, లైసెన్స్‌డ్ సర్వేయర్ల రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించి హాజరు వివరాలు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామపాలన అధికారుల పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, లైసెన్స్‌డ్ సర్వేయర్ల పరీక్ష ఉదయం సెషన్‌తో పాటు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగింది. అభ్యర్థులను గంట ముందుగానే కేంద్రంలోకి అనుమతించారు. జీపీఓ పరీక్షకు 62 మంది అభ్యర్థులకుగాను 55 మంది హాజరుకాగా.. ఏడుగురు గైర్హాజరయ్యారని, లైసెన్స్‌డ్ సర్వేయర్లకు పరీక్షకు 112 మంది అభ్యర్థులకు గా నూ 100 మంది హాజరుకాగా.. 12 మంది గైర్హాజరయ్యారని కలెక్టర్ వివరించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, ఏడీ సర్వే బాలకృష్ణ, తహసీల్దార్ రమేష్‌రెడ్డి, ఇతర రెవెన్యూ అధికారులు ఉన్నారు.