
కాంగ్రెస్‌తోనే సగరులకు గుర్తింపు
వనపర్తిటౌన్: కాంగ్రెస్ పాలనలోనే నియోజకవర్గంలోని సగరులకు ప్రత్యేక గుర్తింపు లభించిందని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో జరిగిన సగరుల జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల సన్మాన సభకు ఆయనతో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి హాజరై ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు తిరుపతయ్య, కార్యదర్శులను పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా గోవర్ధనసాగర్, వనపర్తి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చీర్ల విజయచందర్‌కు సముచిత స్థానం కల్పించి కాంగ్రెస్ గౌరవిస్తున్నటు చెప్పారు. నియోజకవర్గ సగరుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తానని, కమ్యూనిటీ హాల్‌తో పాటు వనపర్తి నల్లచెరువు కట్టపై సగరుడి విగ్రహావిష్కరణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్‌సాగర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చీర్ల విజయచందర్, సగర సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి సత్యం సాగర్, జిల్లా ప్రధానకార్యదర్శి గొబ్బూరి చంద్రాయుడు సాగర్, జిల్లా కోశాధికారి గుంటి సత్యం సాగర్, రాష్ట్ర సగర గౌరవ అధ్యక్షుడు ముత్యాల హరికృష్ణ సాగర్, రాష్ట్ర సంఘం ముఖ్య సలహాదారు ఆంజనేయులు సాగర్, యాదాద్రి సగర సంఘం అధ్యక్షుడు కేపీ రాములు సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుక సత్యంసాగర్, యాదాద్రి సంఘం ఉపాధ్యక్షుడు పల్లె సత్యనారాయణ, రాష్ట్ర సగర సంఘం సంయుక్త కార్యదర్శి విష్ణు సాగర్ పాల్గొన్నారు.