
మహిళా చట్టాలపై అవగాహన
వనపర్తిటౌన్: మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని జిల్లా మహిళా సమైఖ్య సంఘం కార్యాలయంలో మండల మహిళా సమైఖ్య అధ్యక్షులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించగా ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అన్నివర్గాల మహిళలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయసేవలు అందిస్తామన్నారు. ఉచిత న్యాయ సలహాలకు టోల్‌ఫ్రీ నంబర్ 15100 సంప్రదించాలని సూచించారు. గృహహింస, పోక్సో చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, జి ల్లా మహిళా సమైఖ్య అధ్యక్షురాలు స్వరూప, జిల్లా మేనేజర్లు ఆనందం, నాగమల్లిక పాల్గొన్నారు.