
అమృత్ 2.0.. ఆలస్యం
జిల్లాలోని పురపాలికలకు రూ.128.29 కోట్లు మంజూరు
●
పనులు త్వరగా
పూర్తి చేయండి..
పట్టణంలో అమృత్ 2.0 పనులు నత్తనడకన సాగుతున్నాయి. గతేడాది పనులు ప్రారంభంకాగా.. ఇప్పటి వరకు సగం కూడా పూర్తి చేయలేదు. పట్టణంలో ఇప్పటికే తాగునీటి సమస్య అధికంగా ఉంది. బీసీకాలనీలోని 6, 7 వార్డుల్లో చేతి పంపులు, పుర కొళాయిలు ఉన్నా నీటి సరఫరా సక్రమంగా జరగక ఆయా కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
– వెంకటేష్, అమరచింత
కొత్త కాలనీల్లోనూచేపట్టాలి..
పురపాలికల్లో కొత్తగా ఏర్పాటైన కాలనీల్లో తాగునీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం అమలు చేస్తున్న కొత్త పథకాన్ని తాగునీరు అందని వార్డులకు విస్తరించి పనులు చేపట్టాలి. అప్పుడే పట్టణ ప్రజలకు నిత్యం తాగునీరు అందుతుంది.
– లాల్‌కోట రవి, కొత్తకోట
నిర్దేశిత గడువులోగా..
జిల్లాలోని అన్ని పురపాలికల్లో ఇచ్చిన లక్ష్యం మేర పనులు చేపడుతున్నాం. ఇప్పటికే వనపర్తి, అమరచింత, ఆత్మకూర్లో పనులు కొనసాగుతుండగా.. మిగిలిన కొత్తకోట, పెబ్బేరులోనూ పనులు చేపట్టి నిర్దేశించిన గడువులోగా పూర్తిచేసి ప్రజలకు తాగునీటిని అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం.
– విజయభాస్కర్‌రెడ్డి, ఈఈ,
ప్రజారోగ్యశాఖ, మహబూబ్‌నగర్ డివిజన్
అమరచింత: మున్సిపల్, అర్బన్, నగరపాలక ప్రాంతాల్లోని ప్రజలకు శాశ్వతంగా శుద్ధజలం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకాన్ని ప్రారంభించి రూ.కోట్లు వెచ్చిస్తున్నా పనుల్లో పురోగతి మాత్రం కనిపించడం లేదు. జిల్లాలోని 5 పురపాలికలకు రూ.128.29 కోట్లు కేటాయించి జనాభా ప్రాతిపదికన తాగునీటి సరఫరాకు ఓవర్‌హెడ్ ట్యాంకులు, పైప్‌లైన్ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. పనులు దక్కించుకున్న ఓ కంపెనీ ఆరంభంలో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినా.. నేటికి ఆయా పురపాలికల్లో 50 శాతం పనులు సైతం పూర్తిగాని పరిస్థితి ఉంది.
2024, ఆగష్టులో
పనులు ప్రారంభం..
కేంద్రం అమలు చేస్తున్న అమృత్ 2.0 పథకంలో భాగంగా గతేడాది ఆగష్టులో తాగునీటి ట్యాంకులు, పైప్‌లైన్ల నిర్మాణాలను జిల్లాలోని వనపర్తి, అమరచింత, ఆత్మకూర్ పురపాలికల్లో ప్రారంభించిన అధికారులు కొత్తకోట, పెబ్బేరులో ట్యాంకుల నిర్మాణాలకు స్థలాల కేటాయింపులో జాప్యం జరిగింది. రెండు నెలల కిందటే ఆయా పురపాలికల్లోనూ పనులు ప్రారంభించినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. పనుల్లో వేగం పెంచి సకాలంలో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నా.. బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతుండటంతోనే పనులు నత్తనడకన సాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గతేడాది ఆగష్టులో పనులు ప్రారంభం
నేటికీ పైప్‌లైన్లు కూడా పూర్తికాని వైనం
పెబ్బేరు, కొత్తకోటలో మరింత ఆలస్యం

అమృత్ 2.0.. ఆలస్యం

అమృత్ 2.0.. ఆలస్యం

అమృత్ 2.0.. ఆలస్యం