చట్టాలపై విద్యార్థులకు అవగాహన | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై విద్యార్థులకు అవగాహన

Jul 23 2025 6:04 AM | Updated on Jul 23 2025 6:04 AM

చట్టా

చట్టాలపై విద్యార్థులకు అవగాహన

వనపర్తి రూరల్‌: మండలంలోని గాయత్రి పాలిటెక్నిక్‌ కళాశాలలో మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి రజని పాల్గొని విద్యార్థులకు మోటారు వెహికల్‌, పోక్సో, విద్యాహక్కు చట్టం, బాల్య వివాహాల నిర్మూలన, ఉచిత న్యాయ సాయం గురించి అవగాహన కల్పించారు. విద్యాసంస్థల్లో కొత్తగా చేరే విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్‌ చేసే ప్రమాదం ఉందని, ర్యాగింగ్‌తో అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పా రు. ర్యాగింగ్‌కు స్వస్తి పలికేందుకు ప్రత్యేక చట్టాలు రూపొందించారని వివరించారు. ప్రతి విద్యార్థితో ర్యాగింగ్‌కు పాల్పడమని అంగీకార పత్రం తీసుకోవాలని సూచించారు. ఉచిత న్యాయ సలహాలకు టోల్‌ఫ్రీ నంబర్‌ 15100 సంప్రనదించాలని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ఛైర్మన్‌ రఘువీరారెడ్డి, కృష్ణయ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

రేపు పంచముఖికి ప్రత్యేక బస్సు

వనపర్తిటౌన్‌: అమావాస్యను పురస్కరించుకొని గురువారం పంచముఖి పుణ్యక్షేత్రానికి వనపర్తి డిపో నుంచి ప్రత్యేక డీలక్స్‌ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్‌ వేణుగోపాల్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 24న మధ్యాహ్నం 12 గంటలకు వనపర్తి నుంచిి ప్రత్యేక బస్సు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు పంచముఖికి చేరుకుంటుందన్నారు. దర్శనానంతరం మంత్రాలయానికి వెళ్లి తిరిగి పంచముఖికి చేరుకొని రాత్రి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలకు వనపర్తికి వస్తుందని వివరించారు. టిక్కెట్‌ ధర రూ.600గా నిర్ణయించామని.. ఈ అవకాశాన్ని భక్తులు, ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు సెల్‌నంబర్లు 99592 26289, 73828 29379 సంప్రదించాలని పేర్కొన్నారు.

విద్యాసంస్థల బంద్‌

విజయవంతం చేయాలి

వనపర్తి విద్యావిభాగం: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ బుధవారం పాఠశాలలు, కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చామని.. విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించి విజయవంతం చేయాలని పీడీఎస్‌యూ రాష్ట సహాయ కార్యదర్శి కె.పవన్‌కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆది కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, ఎంఈఓ, డీఈఓ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడంతో పాటు పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు రామకృష్ణ, అనిల్‌, వంశీ తదితరులు పాల్గొన్నారు.

రేపు జాబ్‌మేళా

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): ఎంప్లాయిమెంట్‌ శాఖ ఆధ్వర్యంలో 24వ తేదీ (గురువారం)న జిల్లా ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఆ శాఖ అఽధికారి మైత్రి ప్రియ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్‌ రంగంలో 500 ఉద్యోగాల కోసం ఈ మేళా నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాల కోసం 99485 68830, 89193 80410 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

గడువు పొడిగింపు

గద్వాల: అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం దరఖాస్తు తేదీని ఆగస్టు 31వ తేదీవరకు పొడిగించినట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి నుషిత ప్రకటనలో తెలిపారు. అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకంలో ఈ విద్యా సంవత్సరం నుంచి 210 సీట్ల నుంచి 500 సీట్ల వరకు పెంచినందున ఆసక్తి గల ఎస్సీ అభ్యర్థులు www.epass.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

చట్టాలపై  విద్యార్థులకు అవగాహన 
1
1/1

చట్టాలపై విద్యార్థులకు అవగాహన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement