
‘ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్’
వనపర్తి రూరల్: కాంగ్రెస్‌పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం శ్రీరంగాపురం మండలం వెంకటాపురం గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయనతో పాటు ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రాఘవేందర్‌గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పేరుతో లబ్ధిదారులను మోసం చేస్తోందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రాములు యాదవ్, సత్యనారాయణ, శివ, నరేష్ యాదవ్, మల్లేష్ యాదవ్, లక్ష్మీనారాయణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.