ఆశలు.. అడియాసలేనా?!
●
నిబంధనల మేరకే..
ప్రభుత్వ నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక చేపడుతున్నాం. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల జాబితాను ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇచ్చిన విధంగానే విచారణ జరిపి నివేదిక తయారు చేసుకున్నాం. వార్డుకు 10 చొప్పున పట్టణానికి 100 ఇళ్లు మాత్రమే వచ్చాయి. కలెక్టర్, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఎంపిక విధానం జరుగుతుంది.
– రవిబాబు, మున్సిపల్ కమిషనర్,
అమరచింత
అమరచింత: ప్రజా పాలనలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రజలు ప్రజాపాలన సదస్సులలో తమకు ఇళ్లు కావాలంటూ వేలాదిగా దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ఇందిరమ్మ ఇల్లు మంజూరైతే పాత మట్టి ఇంటిని తొలగించి కొత్త ఇంటిని నిర్మించుకుందామని ఆశపడిన లబ్ధిదారుల ఆశలు అడియాసలు అయ్యేలా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం పట్టణాల్లో వార్డుల వారిగా ఇందిరమ్మ కమిటీని ఏర్పాటు చేసి వారి ద్వారానే లబ్ధిదారులను గుర్తించే బాధ్యత అప్పగించడంతో కమిటీలో సభ్యులుగా ఉన్న అధికార పార్టీ నాయకులదే పైచేయి అన్నవిధంగా తయారైంది. పట్టణానికి సుమారు 500 మేర ఇళ్లు మంజూరవుతాయి అనుకుంటే కేవలం పట్టణానికి 100 నుంచి 150 మాత్రమే కేటాయించడంతో ఎంపిక ప్రక్రియ అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో వార్డుల వారిగా ఎంపిక ఇందిరమ్మ కమిటీలకే వదిలేయడం, వారిచ్చిన జాబితానే అధికారులు పరిశీలించే కార్యక్రమం చేపట్టడంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. లోపాయికారిగా ఇందిరమ్మ కమిటీ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే కమిటీలో ఉన్న అధికార పార్టీ నాయకులు తమకు కావాల్సిన వారి పేర్లను రాసుకుని అధికారులకు ఇస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం జనం బేజారు
ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు ఇలా..
వేలల్లో దరఖాస్తులు.. పదుల్లో కేటాయింపు
ఖాళీ స్థలం ఉంటేనే ఇల్లు మంజూరుకు సిఫార్సు
నిజమైన అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన
ఇందిరమ్మ కమిటీలదే తుది నిర్ణయమంటున్న అధికారులు


