అవగాహనతోనే మలేరియా నిర్మూలన
వనపర్తి విద్యావిభాగం: అవగాహనతోనే మలేరియాను నిర్మూలించవచ్చనని జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు అన్నారు. ప్రపంచ మలేరియా నిర్మూలన దినం సందర్భంగా శుక్రవారం జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, జిల్లా ప్రోగ్రాం అధికారి డా. సాయినాథ్‌రెడ్డి సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా మలేరియా మరణాలు సంభవిస్తున్నాయన్నారు. దోమ కాటుతోనే మలేరియా వస్తుందని.. నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించడంతో దోమల వృద్ధిని నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో డా. పరిమళ, ఇమ్యునైజేషన్ అధికారి డా. మారుతి, క్షయ వ్యాధి వైద్యాధికారి డా. నందన్‌గౌడ్, జిల్లా మలేరియా నివారణ ఇన్‌చార్జ్ అధికారి డా. శ్రీనివాస్‌జీ, రవీంద్రగౌడ్, ఆరోగ్య విస్తరణ అధికారి నరసింహారావు, ఆరోగ్య పర్యవేక్షకుడు రాము, గంధం రాజు తదితరులు పాల్గొన్నారు.


