రైతులపై జులుం.. | - | Sakshi
Sakshi News home page

రైతులపై జులుం..

Jun 23 2024 12:40 AM | Updated on Jun 23 2024 12:40 AM

● గద్వాల జిల్లా మల్దకల్‌ మండలానికి చెందిన ఓ సీడ్‌ ఆర్గనైజర్‌ వద్ద గట్టు మండలంలోని తప్పెట్లమొర్సు గ్రామానికి చెందిన ఓ రైతు గత ఖరీప్‌లో సీడ్‌ పత్తి సాగు కోసం రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. విత్తనాలు ఫెయిల్‌ కావడం.. ఇతరత్రా కారణాలతో అప్పు సకాలంలో చెల్లించకపోవడంతో సదరు ఆర్గనైజర్‌ దాష్టీకానికి పాల్పడ్డాడు. తన వద్ద పనిచేసే గుమస్తాలను పంపించి వ్యవసాయ పొలంలో రైతుపై దాడి చేయించారు. కుటుంబసభ్యులు తిరగబడడంతో గుమస్తాలు వెనక్కి రాగా.. అప్పట్లో ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ఇలాంటి ఘటనలే ధరూరు, కేటీదొడ్డి, గట్టు మండల పరిధిలో సైతం చోటుచేసుకున్నాయి.

● గద్వాల జిల్లా అయిజ మండలంలోని బింగుదొడ్డికి చెందిన ఓ రైతు విత్తన పత్తి సాగు కోసం మల్దకల్‌ మండలంలోని ఓ సీడ్‌ ఆర్గనైజర్‌ వద్ద సుమారు రూ.4 లక్షలు అప్పు తీసుకున్నాడు. సకాలంలో డబ్బు చెల్లించకపోవడంతో సదరు ఆర్గనైజర్‌ ఏకంగా ఆ రైతు వ్యవసాయ పొలాన్ని రిజిస్టర్‌ చేయించుకున్నాడు. రైతులు తిరగబడడం, ఎస్పీ, కలెక్టర్‌ వద్దకు సమస్య వెళ్లడంతో ఆర్గనైజర్‌ దిగి వచ్చి ఆ భూమిని మళ్లీ రైతు పేరిట రిజిస్టర్‌ చేయించాడు. అప్పట్లో ఈ ఘటన దుమారం రేపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement