గురువులకు పరీక్ష..! | - | Sakshi
Sakshi News home page

గురువులకు పరీక్ష..!

Nov 11 2026 3:51 AM | Updated on Nov 11 2026 3:51 AM

ఉపాధ్యాయులకు అదనపు భారం

పదో తరగతి ఎస్‌ఏ–1 పరీక్షల పర్యవేక్షణ పేరుతో ఇతర పాఠశాలకు చెందిన స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయులను పరిశీలకులుగా నియమించడాన్ని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక జిల్లా కమిటీ తరఫున ఖండించింది. గెజిటెడ్‌ హోదాలో ఉన్న ప్రధానోపాధ్యాయుడు నిర్వహిస్తున్న పాఠశాల స్థాయి పరీక్షల పర్యవేక్షణకు మరో పాఠశాలకు చెందిన స్కూల్‌ అసిస్టెంట్‌ను పంపడం ప్రధానోపాధ్యాయుల గౌరవానికి భంగం కలిగించడమే. మరోవైపు ఇతర ప్రాంతాల పాఠశాలలకు ఉపాధ్యాయులను పంపడం వల్ల వారు తమ సొంత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థాల్య పెంపుపై పరిశీలించే అవకాశం కోల్పోతారు. ఓ వైపు మిషన్‌ మార్చి–2027 పేరుతో విద్యార్థుల ప్రగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశిస్తూ మరోవైపు అదే విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులను దూరం చేయడం పరస్పర విరుద్ధం. ఈ విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి.

– పి.శ్రీనివాసరావు, చైర్మన్‌, ఫ్యాప్టో జిల్లా కమిటీ

విజయనగరం అర్బన్‌:

గత రెండున్నరేళ్లుగా విద్యారంగం గాడితప్పిందా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలు ఆయా వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే నిర్ణయాలు కాకుండా.. వారిని అణగదొక్కే, ఆందోళనకు గురిచేసే విధానాల అమలును విద్యావేత్తలు, మేధావులు తప్పుబడుతున్నారు. ఉపాధ్యాయ సంఘాలు బహిరంగంగా విమర్శిస్తున్నాయి. పదోతరగతి విద్యార్థులను పబ్లిక్‌ పరీక్షలకు సిద్ధం చేయాల్సిన కీలక సమయంలో ఉపాధ్యాయులకు అదనపు విధులు అప్పగించడం, ఎస్‌ఏ–1న పరీక్ష పరిశీలకులుగా ఇతర పాఠశాలల్లో విధులకు పంపిస్తూ విద్యార్థులకు బోధనను దూరం చేయడాన్ని ఉపాధ్యాయులు తప్పుబడుతున్నారు. విద్యార్థుల అభ్యసన ప్రక్రియపై ప్రభావం పడుతుందని, భవిష్యత్తు అంధకారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా విద్యాశాఖ ఈ నెల 8న జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. మిషన్‌ మార్చి–2027లో భాగంగా పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1 (ఎస్‌ఏ–1) పరీక్షల పర్యవేక్షణకు స్కూల్‌లెవెల్‌ అబ్జర్వర్లను నియమించారు. ఈ నెల 9 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనుండగా, ఒక పాఠశాల ఉపాధ్యాయులు వేర్వేరు మండలాల్లో కేటాయించిన పాఠశాలలకు వెళ్లి పరీక్షల తీరును పరిశీలించాలి. భాషా సబ్జెక్టులు బోధించే స్కూల్‌ అసిస్టెంట్లకు ఈ నెల 9 నుంచి 11 వరకు, నాన్‌ లాంగ్వేజ్‌ సబ్జెక్టుల ఉపాధ్యాయులకు ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు విధులు కేటాయించారు. ఉదయం 8.30 గంటలకు కేటాయించిన పాఠశాలకు చేరుకుని హెచ్‌ఎంకు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే పరీక్షలను పర్యవేక్షించాలి. చూసిరాతలు జరగకుండా చూడాలి. జవాబు పత్రాలను అదే రోజు మండల విద్యాశాఖాధికారికి అందజేయాలి. అయితే, దీనివల్ల సొంత పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయడంలో అవాంతరం కలుగుతోందని, విద్యార్థులపై పర్యవేక్షణ లోపిస్తుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మరోవైపు ఇతర పాఠశాలల ఉపాధ్యాయులను పరీక్షల పరిశీలకులుగా నియమించడంపై ఆ పాఠశాలల్లో ఉన్న హెచ్‌ఎంలు అవమానకరంగా భావిస్తున్నారు.

ఇదీ పరిస్థితి...

ఉపాధ్యాయులపై పరీక్షల భారం!

పర్యవేక్షణ పేరుతో దూర ప్రాంతాలకు డ్యూటీలు

బోధనకు దూరమవుతున్న టీచర్లు

ఒకవైపు పదో తరగతి విద్యార్థుల

భవిష్యత్తు... మరోవైపు ఇతర

పాఠశాలల్లో పరిశీలకుల విధులు

ఎస్‌ఏ–1 పరీక్షల పర్యవేక్షణ ఉత్తర్వులపై గురువుల గుర్రు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement