● రాజాంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో సమీక్షించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్
రాజాం: రాజాంలో మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులంతా సిద్ధం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాజాంలోని పార్టీ కార్యాలయంలో మున్సిపాల్టీలోని పలువార్డులకు చెందిన కార్యకర్తలతో మంగళవారం సమీక్షించారు. నేడోరేపో రాజాం మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుందన్నారు. కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేస్తే విజయం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ప్రతివార్డులో గెలుపుగుర్రాలను బరిలోకి దించాలని సూచించారు. అటు చైర్మన్‌తో పాటు ఇటు అన్ని కౌన్సిలర్ స్థానాలు దక్కించుకోవాలన్నారు. పార్టీ రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ తలే రాజేష్, పార్టీ పట్టణ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, రూరల్ కన్వీనర్ లావేటి రాజగోపాలనాయుడు మాట్లాడారు. రాజాం మున్సిపాల్టీకి చెందిన పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా ఉయ్యాల కంబాల ఉత్సవం
విజయనగరం కల్చరల్(క్రైమ్): ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పైడితల్లి అమ్మవారి ఉయ్యాల కంబాల ఉత్సవం మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణాల నడుమ చదురుగుడి గర్భాలయంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఉత్సవ విగ్రహానికి ఆలయ ప్రాంగణంలో అభిషేకాలు, అర్చనలు జరిపారు. అనంతరం సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ఆలయ తలయారీ పైడిరాజు తదితరులు సంప్రదాయం ప్రకారం ఉత్సవ విగ్రహాన్ని ఆలయ ఉత్తర భాగాన సిద్ధం చేసిన ఉయ్యాలలో ఉంచి ఉయ్యాలకంబాల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉయ్యాలకంబాల ఉత్సవంతో పైడితల్లి జాతర ముగిసినట్టేనని అర్చకులు తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు వనంగుడిలో అమ్మవారి చండీహోమంతో అమ్మవారి జాతర పరిసమాప్తం అవుతుందని ఆలయ పూజారి వెంకటరావు తెలిపారు.


