ప్రజల ప్రాణాలతో చెలగాటం...! | - | Sakshi
Sakshi News home page

ప్రజల ప్రాణాలతో చెలగాటం...!

Nov 8 2026 10:36 AM | Updated on Nov 8 2026 10:36 AM

విజయనగరం అర్బన్‌: పెట్రోల్‌ బంక్‌ సమీపంలోనే గ్యాస్‌ గొడౌన్‌... ఆ పక్కనే బాణసంచా దుకాణాల సముదాయాలు. నిప్పుతో చెలగాటమాడే బాణసంచా విక్రయాలకు ఇలాంటి ప్రాంతాన్ని ఎలా ఎంపిక చేశారు? ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్న ఈ పరిసరాలను అనుమతులు మంజూరు చేసే సమయంలో అధికారులు పరిశీలించలేదా? ప్రమాద తీవ్రతను అంచనా వేయకుండా దుకాణాల ఏర్పాటుకు ఎలా అనుమతులిచ్చారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విజయనగరం రింగ్‌రోడ్డు, సాయిబాబా కోవిల జంక్షన్‌ సమీపంలోని ప్రైవేట్‌ ఖాళీ స్థలంలో దీపావళి బాణసంచా విక్రయాల కోసం సామూహిక దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ దుకాణాల సముదాయానికి ఆనుకుని పెట్రోల్‌ బంక్‌, పరిసరాల్లో గ్యాస్‌ గొడౌన్లు ఉండటం తీవ్ర అందోళన కలిగిస్తోంది. బాణసంచా నిల్వలు, విక్రయాల సమయంలో చిన్నపాటి నిప్పురవ్వలు, అగ్నిప్రమాదాలు సంభవించినా సమీపంలోని ఇంధన నిల్వ కేంద్రాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మూడు శాఖల అధికారుల దృష్టికి రాలేదా?

బాణసంచా విక్రయ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి అగ్నిమాపక, మున్సిపల్‌, రెవెన్యూ శాఖల అధికారులు వివిధ స్థాయిలో పరిశీలనలు చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా బాణసంచా దుకాణాల చుట్టుపక్కల ఉన్న భవనాలు, పెట్రోల్‌ బంకులు, గ్యాస్‌ నిల్వ కేంద్రాలు, జనసంచారం వంటి అంశాలు కీలకం. అయినప్పటికీ ఇలాంటి నున్నితమైన ప్రాంతంలో దుకాణాల ఏర్పాట్లు సాగుతుండటంపై అధికారుల పర్యవేక్షణ తీరుపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

ప్రమాదం జరిగితే...

బాణసంచా విక్రయాల ద్వారా వ్యాపారులకు ఆదాయం సమకూరవచ్చు. కానీ వాటి నిర్వహణలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. పెట్రోల్‌ బంక్‌, గ్యాస్‌ గొడౌన్ల సమీపంలో బాణసంచా విక్రయాలు నిర్వహించడం వల్ల తలెత్తే ప్రమాదాలను అధికారులు ముందుగానే అంచనా వేయాల్సిన అవసరం ఉంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలించి, వర్తించే భద్రతా నిబంధనలు, అవసరమైన దూర ప్రమాణాలను ధ్రువీకరించకుండా విక్రయాలు కొనసాగించకూడదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా అగ్నిమాపక, మున్సిపల్‌, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి, పెట్రోల్‌ బంక్‌, గ్యాస్‌ గొడౌన్ల సమీపంలో బాణసంచా దుకాణాల నిర్వహణకు అనుమతులు నిబఽంధనలకు అనుగుణంగా ఉన్నా యా లేదా స్పష్టం చేయాలి. ప్రజల భద్రతకు ము ప్పు ఉందని తేలితే తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఒకవైపు క్రాకర్స్‌..

మరోవైపు పెట్రోల్‌ బంక్‌

వాటి సమీపంలోనే బాణసంచా దుకాణాలు

మూడు శాఖల అధికారుల దృష్టికి రాలేదా?

ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత!

అధికారుల సర్వత్రా విమర్శలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement