విజయనగరం: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పాల్గొనబోయే జిల్లా హాకీ జట్ల ఎంపిక పోటీలకు అనూహ్య స్పందన లభించింది. విజయనగరం జిల్లా కేంద్రంలోని విజ్జి స్టేడియంలో అండర్ – 14, 17, 19 విభాగాల్లో బాల, బాలికలకు నిర్వహించిన ఎంపికల్లో సుమారు 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరికి ఎంపిక పోటీలు నిర్వహించగా... ఉత్తమ ప్రతిభ కనబరి చిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. జిల్లా స్థాయి పోటీల్లో ఎంపికై న అండర్–19 క్రీడాకారులకు రాష్ట్ర స్థాయి పోటీలు ఈ నెల 14 నుంచి కర్నూలులో జరగనున్నాయి. అండర్ – 14 పోటీలు బాపట్లలో, అండర్–17 పోటీలు అనకాపల్లి జిల్లా లో నిర్వహించనున్నారు. ఎంపిక పోటీలను జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు వాణిశ్రీ,, శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు రమేష్, సునీత, సూర్యారావు, విజయలక్ష్మి, రాజేష్, శ్రీకాంత్ సెలక్షన్ కమిటీ సభ్యులుగా వ్యవహరించారు.


