● ఏడుగురికి తీవ్ర గాయాలు
● పాత కక్షలు కారణంగా ఘటన
వంగర: మండల పరిధి శ్రీహరిపురం గ్రామంలో ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది. గతంలో పాత కక్షలు కారణంగా కొట్లాట జరిగిందని హెచ్‌సీ దూసి రాములు తెలిపారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఇరు వర్గాలకు చెందిన ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ వర్గీయులు గుడివాడ ఆదెమ్మదొర, గుడివాడ సతీష్‌దొర, వాడాడ శ్రీను తీవ్రంగా గాయపడగా.. టీడీపీ వర్గానికి చెందిన బొత్స పట్టాభినాయుడు, బొత్స వెంకునాయుడు, బొత్స రాము, బొత్స రమణ గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను రాజాం సీహెచ్‌సీకి తరలించి వైద్యసేవలందిస్తున్నారు. శ్రీహరిపురంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేశారు. గుడివాడ ఆదెమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై ఐదుగురు వ్యక్తులపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు హెచ్‌సీ రాములు వెల్లడించారు.


