విజయనగరం గంటస్తంభం: దీపావళి పండగ జిల్లా ప్రజల జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖసంతోషాలు నింపాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆకాంక్షించారు. చీకటిపై వెలుగు విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళిని ప్రజలంతా పర్యావరణహితంగా జరుపుకోవాలని కోరారు. బాణసంచా కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదాలకు తావులేకుండా పండుగను సురక్షితంగా జరుపుకోవాలని సూచించారు.
గవర్నర్ చేతులమీదుగా రాజ్యపురస్కార్ అవార్డుల ప్రదానం
● అమరావతిలో జిల్లా విద్యార్థులకు
మంచి గుర్తింపు
విజయనగరం అర్బన్: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాజ్యపురస్కార్ సర్టిఫికెట్లను రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్‌నజీర్ చేతుల మీదుగా అందుకున్నారు. అమరావతిలోని లోక్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కీడాంకు చెందిన స్కౌట్ విద్యార్థి బండారు చరణ్, కొత్తవలస జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన గైడ్ విద్యార్థిని ఎల్.ధనక్ష్మి జిల్లా ప్రతినిధులుగా పాల్గొన్నారు. సంస్థ సేవా కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొంటున్న రిటైర్డ్ గ్రేడ్–2 హెచ్‌ఎం సీహెచ్ నారాయణమూర్తికి గవర్నర్ ప్రశంసాపత్రం, షీల్డ్ అందజేశారు. విద్యార్థులు నాలుగేళ్లుగా పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, ఆరోగ్య అవగాహన, స్వయం ఉపాధి ప్రాజెక్టులు, పాఠశాల పరిశుభ్రత, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నందుకు గుర్తింపుగా లభించిందని స్కౌట్స్ అండ్ గైడ్స్ కమిషనర్లు ఈపు విజయకుమార్, సౌభాగ్యలక్ష్మి, కార్యదర్శులు వాక చిన్నంనాయుడు, ఎస్.కనకలక్ష్మి, ఆర్గనైజింగ్ కమిషనర్లు కె.గాయత్రి, డి.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పురస్కార్ విజేతలను డీఈఓ యు.మాణిక్యంనాయుడు అభినందించారు.
గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా
ప్రశంసాపత్రాలను అందుకుంటున్న విద్యార్థులు బండారు చరణ్, ఎల్.ధనలక్ష్మి,
జిల్లా ప్రజలకు దీపావళి పండగ శుభాకాంక్షలు తెలియజేసిన కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి


