పాడుబడిన భవనాలు | - | Sakshi
Sakshi News home page

పాడుబడిన భవనాలు

Nov 7 2026 1:30 AM | Updated on Nov 7 2026 1:30 AM

శిథిలావస్థకు చేరిన ఈ భవనాలను చూశారా... ఇవి కొత్తవలస మండలంలోని కంటకాపల్లి ప్రాథమిక పాఠశాల, లక్కవరపుకోట మండలం లచ్చింపేట ప్రాథమిక పాఠశాల ఆవరణలోనివి. ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. భవనాలు కూల్చివేయాలని ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు ఉన్నతాధికారులకు నివేదించినా స్పందన లేకపోవడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాదం జరగకముందే ఈ భవనాలను తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. – కొత్తవలస/లక్కవరపుకోట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement