మడ్డువలస గేట్లు ఎత్తివేత | - | Sakshi
Sakshi News home page

మడ్డువలస గేట్లు ఎత్తివేత

Nov 7 2026 1:30 AM | Updated on Nov 7 2026 1:30 AM

వంగర: సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి 5వేల క్యూసెక్కుల నీరు మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో చేరుతోంది. దీంతో రెండు గేట్లు ఎత్తి వచ్చిన నీటిని తిరిగి నదిలోకి విడిచిపెడుతున్నట్టు ప్రాజెక్టు ఏఈ నితిన్‌ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద 64.43 మీటర్ల నీటిమట్టం నమోదైంది.

పంట కోత ప్రయోగాలకు సన్నద్ధం

● హెక్టార్‌ విస్తీర్ణంలోని వరి 5,200 కిలీలో దిగుబడి వచ్చే అవకాశం

● గతేడాది హెక్టార్‌కు 6,100 కిలోల దిగుబడి

విజయనగరం ఫోర్ట్‌: ఈ ఏడాది ఖరీఫ్‌ తొలిదశలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక వరి సాగు ఆలస్యమైంది. కొన్నిచోట్ల పంటపొలాలు బంజరు భూములుగా మిగిలాయి. జిల్లాలో వరి పంట సాధారణ సాగు విస్తీర్ణం 1.02 లక్షల హెక్టార్లుకాగా, 95 వేల హెక్టార్లలోనే సాగైంది. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి పంట ప్రయోగాలు చేసేందుకు వ్వయసాయ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 2024 చోట్ల పంట కోత ప్రయోగాలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. పంట కోత ప్రయోగం ద్వారా ధాన్యం దిగుబడి ఎంత వస్తుందనేది వ్యవసాయ అధికారులు అంచనా వేయనున్నారు. అయితే, హెక్టారుకు ఈ ఏడాది ధాన్యం 5,200 కేజీల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. గతేడాది 6,100 కేజీల ధాన్యం దిగుబడి వచ్చింది. గతేడాది కంటే ఈ ఏడాది 900 కేజీల వరకు దిగుబడి తగ్గొచ్చని చెబుతున్నారు.

గురుకుల బాలికలకు సుస్తీ

గుమ్మలక్ష్మీపురం: కురుపాం మండలంలోని శివన్నపేట వద్ద గల గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారంతా జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి, విరేచనాలు వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. గురువారం జరిగిన ఈ సంఘటన బయటకు పొక్కనీయకుండా అక్కడి సిబ్బంది సుమారు 50 మంది విద్యార్థినులను కురుపాంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కాకుండా మరో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాదలింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్యసేవలను అందించారు. శుక్రవారం ఈ సమాచారం బయటకు పొక్కడంతో.. పాఠశాల సిబ్బంది కేవలం నాలుగైదు మంది విద్యార్థులే అస్వస్థతకు గురయ్యారని చూపే ప్రయత్నం చేసినప్పటికీ.. రెండు గదుల్లో అస్వస్థతకు గురైన విద్యార్థులను ఉంచి వైద్య సేవలు అందిస్తుండడం మాజీ డిఫ్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి పాఠశాల పర్యటనతో బయటపడింది. దీంతో పలువుర్ని కురుపాం సీహెచ్‌సీకి వైద్యం నిమిత్తం తరలించారు.

అదుపులో ఉన్న జ్వరాలు

కురుపాం గురుకుల పాఠశాలలో జ్వరాల పరిస్థితి అదుపులో ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ మేరకు విద్యార్థుల అస్వస్థతౖపై డెరెక్టర్‌ పబ్లిక్‌ హెల్త్‌, జిల్లా అధికారులతో ఆరా తీసిన ఆరోగ్య మంత్రి కురుపాం గురుకుల పాఠశాలలో 71 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని, వారిలో 30 మంది పూర్తిగా కోలుకున్నారన్నారని, 38 మంది విద్యార్థినులకు ప్రత్యేక వైద్య సంరక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే పాఠశాలకు చెందిన 516 మంది విద్యార్థినులకు ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా 515 మందికి నెగెటివ్‌ వచ్చిందని, ఒకరికి మలేరియా పాజిటివ్‌ వచ్చిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement