● శనివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం
● ఏడు నియోజకవర్గాల్లోని 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు
విజయనగరం రూరల్:
జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం, పోలీస్‌శాఖ సమగ్ర ప్రణాళికతో పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేశాయి. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎస్.రాంసుందర్ రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో కౌంటింగ్ నిర్వహణకు యంత్రాంగం సిద్ధమైంది. నేడు జరగనున్న ఈ ఓట్ల లెక్కింపు కోసం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న 27 మండలాలకు సంబంధించి వేర్వేరు ప్రాంతాల్లో 36 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 27 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 438 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.
విజయనగరం మండలం ఓట్లను విజయనగరం
జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అకడమిక్ బ్లాక్–2 (1వ అంతస్తు) ఎడమవైపు ఎల్‌హెచ్–35 గది.
రాజాం నియోజకవర్గం (జీఎంఆర్ వరలక్ష్మి డీఏవీ పబ్లిక్ స్కూల్, రాజాం):
రాజాం: 41వ గదిలో ఎంపీటీసీ, 40వ గదిలో జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు
రేగిడి ఆమదాలవలస: 37, 38 గదుల్లో..
సంతకవిటి: 30వ గదిలో జెడ్పీటీసీ, 31వ గదిలో ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు.
వంగర: 24, 25 గదులు
శృంగవరపుకోట నియోజకవర్గం
జామి: విజయనగరం జేఎన్టీయూ అకడమిక్ బ్లాక్–2 (2వ అంతస్తు) ఈసీఈ విభాగం ఎల్‌హెచ్–40వ గది.
కొత్తవలస: ఎస్.కోట డాక్టర్ వరలక్ష్మి పబ్లిక్ స్కూల్ 9–బి తరగతి గది.
ఎల్.కోట: డాక్టర్ వరలక్ష్మి పబ్లిక్ స్కూల్ 10వ తరగతి గది.
ఎస్.కోట: డాక్టర్ వరలక్ష్మి పబ్లిక్ స్కూల్ సెమినార్ హాల్
వేపాడ: డాక్టర్ వరలక్ష్మి పబ్లిక్ స్కూల్ (1వ అంతస్తు) 4–బి గది


