పకడ్బందీగా ఓట్ల లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ఓట్ల లెక్కింపు

Nov 7 2026 1:30 AM | Updated on Nov 7 2026 1:30 AM

● అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు

విజయనగరం రూరల్‌: జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా, పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు, కౌంటింగ్‌ విధివిధానాలు, సిబ్బంది బాధ్యతలపై శుక్రవారం వెబెక్స్‌లో అధికారులతో సమీక్షించారు. పలు సూచనలు జారీ చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుమతిలేని వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు, సిబ్బంది విధులపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. రీకౌంటింగ్‌ కోరే అభ్యర్థుల అభ్యర్థనలను నిబంధనల ప్రకారం 15 నిమిషాల వ్యవధిలోనే స్వీకరించాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.

● చెల్లుబాటయ్యే, చెల్లని ఓట్లపై సందేహాలు తలెత్తినప్పుడు రిటర్నింగ్‌ అధికారి నిబంధనల ప్రకారం తుది నిర్ణయం తీసుకోవాలి. కౌంటింగ్‌ ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి, అధికారికంగా ధ్రువీకరించిన నివేదికలను అందించాలని కలెక్టర్‌ సూచించారు. వెబెక్స్‌ సమావేశంలో జేసీ ఎస్‌.సేతుమాధవన్‌, డీఆర్వో సీహెచ్‌.సత్తిబాబు, జెడ్పీ సీఈఓ కిరణ్‌ కుమార్‌, డిప్యూటీ సీఈఓ లవరాజు, ఆర్డీఓలు, డీఎల్‌డీఓలు, రిటర్నింగ్‌ అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

పటిష్ట భద్రత

విజయనగరం టౌన్‌: ఎన్నికల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ఎస్పీ ఎ.ఆర్‌.దామోదర్‌ తెలిపారు. భద్రతా ఏర్పాట్లపై పోలీసులకు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థులు, వారి అధీకృత కౌంటింగ్‌ ఏజెంట్లను, గుర్తింపు కార్డులు, తగిన ధ్రువీకరణ పత్రాలు ఉన్నవారినే కౌంటింగ్‌ కేంద్రం లోపలికి అనుమతించాలన్నారు. మొబైల్‌ ఫోన్లు, ఐప్యాడ్స్‌, ల్యాప్‌టాప్‌లు, ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయగల ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను కౌంటింగ్‌ హాల్‌లోకి అనుమతించరాదన్నారు. ప్రజలు, రాజకీయపార్టీల నాయ కులు, అభ్యర్థులు పోలీసుశాఖకు సహకరించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement