విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా అండర్–19 బాల, బాలికల జట్లు శుక్రవారం పయనమయ్యాయి. ఈనెల 7,8 తేదీల్లో రెండు రోజుల పాటు అనంతపురం జిల్లాలో జరగనున్న పోటీల్లో బాలురజట్టు తరఫున 12 మంది, బాలికల జట్టు తరఫున 12 మంది క్రీడాకారులు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ మేరకు జిల్లా జట్టులోని క్రీడాకారులకు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు వాణిశ్రీ, శ్రీనివాస్‌లు అభినందనలు తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించి జిల్లా కీర్తిప్రతిష్టలు చాటిచెప్పాలని పోత్సహించారు. కార్యక్రమంలో పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
14న సివిల్ సర్వీస్
ఉద్యోగుల ఎంపిక పోటీలు
● జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి వెంకటేశ్వరావు
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సివిల్ సర్వీస్ ఉద్యోగుల క్రీడా పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక పోటీలు ఈనెల 14, 15తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు శుక్రవారం తెలిపారు. స్పార్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు ఈనెల 14న అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ క్రీడాంశాల్లో.. 15వ తేదీన కేరమ్స్, చెస్, క్రికెట్, బెస్ట్‌ఫిజిక్, పవర్ లిఫ్టింగ్, టేబుల్ టెప్పిస్, యోగా, టెన్నిస్, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాంశాల్లో ఎంపికలు జరగనున్నట్లు పేర్కొన్నారు. రెండు రోజుల్లో ఉదయం 8 గంటలకు విజయనరగం జిల్లా క్రేంద్రంలోని రాజీవ్‌క్రీడామైదానంలో ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు. జిల్లాస్థాయి ఎంపికల్లో అర్హత సాధించిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నామని, మరిన్ని వివరాలకు ఫోన్ 9491767327, 8074116276 నంబలను సంప్రదించాలని సూచించారు.
ఏపీఎస్‌ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగావకాశాలు
విజయనగరం క్రైమ్: స్థానిక ఆర్టీసీ డిపోలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయడానికి మెకానిక్ ఉద్యోగానికి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు విజయనగరం డిపో మేనేజర్ శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. అభ్యర్థులు తప్పనిసరిగా డీజిల్ మెకానిక్ ట్రేడ్‌లో ఐటీఐ పాసై ఉండాలని తెలియజేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ సర్టిఫికెట్లు తీసుకుని డిపో మేనేజర్ కార్యాలయానికి రావాలని తెలియజేశారు.
వెయిట్‌లిఫ్టింగ్‌లో జోగిరాజుపేట విద్యార్థినికి స్వర్ణం
నెల్లిమర్ల రూరల్: ఇటీవల విశాఖలోని బుల్ల య్య కళాశాలలో జరిగిన అంతర్ కళాశాలల వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లాకు చెందిన విద్యార్థిని ప్రతిభ కనబరిచింది. నెల్లిమర్ల మండలంలోని జోగిరాజుపేట గ్రామానికి చెందిన అట్టాడ ఆదిలక్ష్మి 77 కేజీల విభాగంలో చాంపియన్ షిప్‌లో తలపడి బంగారు పతకాన్ని కై వసం చేసుకుంది. ఈ సందర్భంగా ఆ విద్యార్థినిని కోచ్ చల్లా రాము, గ్రామస్తులు అభినందించారు.


