పొలం పనులు చేస్తూ వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

పొలం పనులు చేస్తూ వ్యక్తి మృతి

Nov 7 2026 1:30 AM | Updated on Nov 7 2026 1:30 AM

పొలం పనులు చేస్తూ వ్యక్తి మృతి చికెన్‌

బ్రాయిలర్‌

లైవ్‌ డ్రెస్‌డ్‌ స్కిన్‌లెస్‌

శ్రీ145 శ్రీ260 శ్రీ270

చికెన్‌

సీతానగరం: వ్యవసాయ పనుల్లో భాగంగా మండలంలోని నిడగల్లులో వరి చేను కోతకు వెళ్లిన ఓ వ్యక్తి అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బగ్గందొరవలస గ్రామానికి చెందిన కొంతమంది రైతులు వరిచేను కోతపనుల నిమిత్తం నిడగల్లుకు శుక్రవారం వెళ్లారు. జట్టులోఉన్న కె లక్ష్మునాయుడు (50) నిడగల్లు పొలంలో వరిచేనుకోస్తుండగా అస్వస్థతకు గురై అపస్మారక స్థితికి చేరుకోగా చికిత్సనిమిత్తం సీతానగరం పీహెచ్‌సీకి తరలించారు. డాక్టర్‌ పి.ఉషారాణి అత్యవసర వైద్య సేవలందించి మెరుగైన వైద్యం నిమిత్తం పార్వతీపురం ప్రైవేటు ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. దీంతో ఆస్పత్రిలో చేరిన సమయానికి అక్కడి డాక్టర్‌ ఆలస్యంగా రావడంతో లక్ష్మునాయుడు మృతిచెందినట్లు గ్రామస్తులు తెలియజేశారు.

చెరువులో పడి వ్యక్తి...

విజయనగరం టౌన్‌: కాలకృత్యాలకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మృతిచెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని సుంకరిపేట గ్రామంలో శుక్రవారం జరిగింది. దీనికి సంబంధించి రూరల్‌ పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని సుంకరిపేటకు చెందిన ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌గా విధులు నిర్వహిస్తున్న బడ్డు సంతోష్‌ కుమార్‌ (35) స్థానిక పిల్లేరు చెరువు వద్దకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు చెరువులో పడిపోవడంతో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతుడి భార్య భారతి ఫిర్యాదు మేరకు ఏఎస్సై రామారావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement