అప్పట్లో ప్రతిపక్షానికి ఒక్కటే..ఇప్పుడు 16..! | - | Sakshi
Sakshi News home page

అప్పట్లో ప్రతిపక్షానికి ఒక్కటే..ఇప్పుడు 16..!

Nov 6 2026 2:20 AM | Updated on Nov 6 2026 2:20 AM

● నడిరోడ్డుపై ఎర్రజెండా..!

భామిని మండలంలోని ఏబీ రోడ్డులో ఏర్పడిన గుంత ప్రమాదానికి సంకేతంగా మారింది. దీనిని పూడ్చడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ... ప్రమాద సంకేతంగా స్థానికులు ఎరుపు రంగు గోనెసంచులతో ఎర్రజెండా తయారు చేసి ఎగురు వేశారు.

– భామిని

విజయనగరం అర్బన్‌:

అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది? ప్రతిపక్షానికి క్షేత్రస్థాయిలో ఎంత ఆదరణ లభిస్తోంది? ఈ ప్రశ్రలకు విజయగనరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరమైన పోలికను ముందుకు తెస్తున్నాయి. ఐదేళ్ల కిందట వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలన మధ్యలో జరిగిన ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష టీడీపీకి కేవలం ఒక్క డివిజన్‌ మాత్రమే దక్కింది. తాజాగా కూటమి ప్రభుత్వ పాలన మధ్యలో జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ 16 స్థానాలను గెలుచుకుంది. ఈ రెండు ఫలితాల మధ్య వ్యత్యాసం ఇప్పుడు రాకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

● ఒక స్థానానికే పరిమితం...

2021లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా జరిగిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మొత్తం 50 డివిజన్లకు ఆ పార్టీ ఏకంగా 48 స్థానాలను గెలుచుకుంది. అప్పటి ప్రతిపక్ష టీడీపీకి ఒక్క స్థానం మాత్రమే దక్కగా, మరో స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి కై వసం చేసుకున్నారు. అంటే ప్రతిపక్షానికి కనీస స్థాయిలో కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ ఫలితాలు అప్పటి ప్రభుత్వ పాలనపై పట్టణ ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదనే అభిప్రాయానికి బలాన్నిచ్చాయి. అధికార పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ, ప్రతిపక్ష బలహీనత అప్పటి ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాయి.

ప్రజల తిరుగుబాటు...

రెండున్నరేళ్ల చంద్రబాబు ప్రభుత్వ పాలనలో కొత్తగా ఒక్కరికి కూడా పింఛన్లు మంజూరు చేయకపోవడం, నిరుద్యోగ భృతి ఎగ్గొట్టడం, ఆడబిడ్డ నిధి అందకపోవడం, నగరాభివృద్ధి పట్టించుకోకపోవడం, సంక్షేమ పథకాలను అమలుచేయకపోవడం, హామీలు నెరవేర్చకపోవడం, ఉద్యోగ వ్యతిరేక విధానాలపై తిరుగుబాటు మొదలైంది. దీనికి కార్పొరేషన్‌ ఎన్నికలే నిలువెత్తు నిదర్శనం. మొత్తం 62 డివజన్లలో వైఎస్సార్‌సీపీ 16 స్థానాల గెలుచుకుంది. టీడీపీ, జనసేన, బీజేీపీ కలిపి 44 స్థానాలు సాధించగా మరో రెండు స్థానాలను స్వతంత్ర అభ్యర్థి దక్కించుకున్నారు. అధికార కూటమికి మెజారిటీ వచ్చినప్పటికీ, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ 16 స్థానాలు గెలుచుకోవడం గమనార్హం. ఐదేళ్ల కిందట ఇవే ఎన్నికల్లో ప్రతిపక్షానికి ఒక్క స్థానమే వచ్చిన పరిస్థితితో పోలిస్తే ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ప్రస్పుటమైందన్న వాదన వినిపి స్తోంది. మరోవైపు ఇటీవల జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో కేవలం 2,447 ఓట్ల వెనుక బాటుతో వైఎస్సార్‌సీపీ ఏకంగా 19 సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. దీనికి పోలింగ్‌ సమయంలో ఓటర్లకు అధికార పార్టీ అభ్యర్థుల బెదిరింపులు కూడా కారణమన్న వాదన వినిపిస్తోంది.

చంద్రబాబు ప్రభుత్వ పాలనపై జనం

వ్యతిరేకత

విజయనగర కార్పొరేషన్‌ ఎన్నికల్లో

తేటతెల్లం

విజయనగరం రాజకీయాల్లో

ఆసక్తికర చర్చ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement