విజయనగరం కల్చరల్ (క్రైమ్): పైడితల్లి అమ్మవారి జాతర సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకులను చదురుగుడిలో గురువారం లెక్కించారు. మొత్తం 19 రోజులకు చదురుగుడిలోని హుండీల నుంచి రూ. 52,58,515లు, బంగారం 43.200 గ్రాములు, వెండి 332 గ్రామాలు వచ్చినట్టు ఆలయ ఈఓ శిరీష తెలిపారు. లెక్కింపులో 62 మంది సేవకులు పాల్గొన్నారు. లెక్కింపును రామతీర్దం దేవదాయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు పర్యవేక్షించారు.
స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేసిన జేసీ
విజయనగరం రూరల్: జేఎన్‌టీయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లు, రిసెప్షన్‌సెంటర్లను జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాథవన్ గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తున్న తీరును ఆయన పరిశీలించారు. బ్యాలెట్ బాక్సుల భద్రతపై అఽధికారులకు పలు సూచనలు చేశారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లుచేయాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. 24 గంటల పాటు నిరంతరం కట్టుదిట్టమైన కాపలా ఉండాలని, సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు రెవెన్యూ, పోలీస్ ఉన్నతాధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.


