సాక్షి, పార్వతీపురం మన్యం: పెరిగిన బియ్యం ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రైతు బజార్లలో ‘ధరణి’ సన్నబియ్యాన్ని తక్కువ ధరకే సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. అనుకున్నంత ప్రచారం లేకపోవడంతో సామాన్య ప్రజలు వాటిని ఉపయోగించకపోగా..వ్యాపారులు మాత్రం బస్తాలకు బస్తాలు తరలించుకుపోయి, అధిక ధరలకు విక్రయించుకుంటున్నారు. పౌరసరఫరాల శాఖ ద్వారా ధరణి బ్రాండ్ పేరుతో 26 కిలోల సన్నబియ్యం బస్తాను రూ.1,300కే రైతు బజార్లలో విక్రయిస్తున్నారు. ఆధార్ కార్డు నంబరును అనుసంధా నం చేసి, 26 కిలోల బస్తా యూనిట్‌గా విక్రయించా లి. కిలో రూ.50 చొప్పున విడిగానూ విక్రయిస్తున్నా రు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో బియ్యం రూ.70 నుంచి రూ.100కుపైగా పలుకుతోంది. 26 కిలోల బస్తా బ్రాండ్‌ను బట్టి రూ.2,200కుపైగా ఉంది. ఇదే అదునుగా పలువురు వ్యాపారులు ఆధార్ కార్డులు సేకరించి, రైతు బజార్ల వద్ద ధరణి సన్నబియ్యం తరలించుకుపోయి, గ్రామాల్లో అధిక ధరలకు విక్రయించుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒకేసారి మూ డు, నాలుగు బస్తాలు చొప్పున తీసుకెళ్తున్నారు. పేదలకు సరఫరా కావాల్సిన బియ్యాన్ని వ్యాపారులు తరలించుకుపోతున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలువినిపిస్తున్నాయి.


