బొబ్బిలిరూరల్: మండలంలోని పిరిడి, చింతాడ, అలజంగి, తదితర గ్రామాల్లో అధికార, విపక్ష పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. సీఐ కె.నారాయణరావు, ఎస్ఐ లోవరాజు, మరికొంతమంది సిబ్బంది కేవలం పక్కి గ్రామంలోని జెడ్పీహెచ్ స్కూల్లో జరిగిన కేంద్రానికే పరిమితం కాగా పోలీసులను మోహరించి అధికార పార్టీకి అనుకూలంగా ఓటు వేయాలన్న అభిప్రాయాన్ని కల్గించారన్న విమర్శలు గ్రామంలోని ఓటర్ల నుంచి వినిపించాయి. కలవరాయి జెడ్పీహెచ్ స్కూల్లో పోలింగ్ బూత్‌లలోకి ఇద్దరేసి చొప్పున పంపి ఏ గుర్తుకు ఓటు వేయాలో ప్రొసీడింగ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అవగాహన కల్పిస్తున్న దృశ్యాలు కనిపించాయి.


