● పోలింగ్ బూత్‌ల వద్ద విద్యుత్
అంతరాయం
బొబ్బిలిరూరల్: స్థానిక సంస్థల ఎన్నిల నేపథ్యంలో ఓట్లు వినియెగించుకునేందుకు వచ్చిన ఓటర్ల ఓ కారు ప్రమాదంలో కారాడ గ్రామ సమీపంలో విధ్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. దీంతో ఈ ప్రభావం కారాడ, అలజంగి గ్రామాల్లోని పోలింగ్ బూత్‌లపై పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పోలింగ్ కేంద్రాల్లో చీకటి అలుముకుంది. అయినా పూర్తిస్థాయిలో ఓటర్ల తమ ఓటు హక్కు వినియెగించుకున్నారని, జనరేటర్ల సహాయంతో విద్యుత్‌ను పునరుద్ధరించామని ఆర్ఓ మురళీనాథ్, ట్రాన్స్‌కో ఏఈ సాంబశివరావు తె లియ జేశారు. కాగా ప్రమాదానికి గురైన వ్యక్తులు ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని సీఐ నారాయణరావు తెలిపారు.
విరిగిపడిన కొండ చరియలు
మల్కన్‌గిరి: మురసు తుఫాన్ ప్రభావం మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి నాయిక్గూడ పంచాయతీలో కనిపించింది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పురిగూడ కొండపై కొండచరియలు విరిగిపడి మట్టిపెళ్లలు, భారీ బండరాళ్లు కొండపై నుంచి కింద దొర్లిపడ్డాయి. గురువారం భారీ శబ్ధంతో రెండు బండరాళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో దుమ్ము వ్యాపించింది. వరుసగా పెద్దపెద్ద రాళ్లు కొండపై నుంచి కిందకిపడ్డాయి. ఈ ఘటనతో పురిగూడ గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు గ్రామస్తులు పరుగులు తీస్తూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. గ్రామం కొండ దిగువన ఉండడంతో ఈ ఘటన అనంతరం ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అదృష్టవశాత్తు ఈ కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదు.
రాయగడ: రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం పాలైన ఘటన జిల్లాలోని బిసంకటక్‌లో చోటు చేసుకుంది. మృతుడు సమితిలోని బారిగుడ గ్రామానికి చెందిన నరి టక్రి (22)గా గుర్తించారు. సమా చారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. మంగళవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం ఆవులను తరలిస్తున్న ఒక పికప్ వ్యాన్ , ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు తీవ్రగాయాలకు గురికావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బిసంకటక్ నుంచి రాయగడ వైపు ఆవులను ఒక వ్యాన్‌లో తరలిస్తుండగా అదే సమయంలో ఎదురుగా వస్తున్న బైకుపై వస్తున్న యువకుడిని వ్యాన్ అదుపుతప్పి బలంగా ఢీకొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


