గడగమ్మలో రీ–పోలింగ్‌ నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

గడగమ్మలో రీ–పోలింగ్‌ నిర్వహించాలి

Nov 6 2026 2:20 AM | Updated on Nov 6 2026 2:20 AM

గడగమ్మలో రీ–పోలింగ్‌ నిర్వహించాలి

● ఎన్నికల అధికారులను కోరిన జెడ్పీటీసీ అభ్యర్థి దమలపాటి

వీరఘట్టం: మండలంలోని గడగమ్మ పోలింగ్‌ కేంద్రంలో గురువారం జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో కూటమి నాయకులు రిగ్గింగ్‌ చేశారని వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి దమలపాటి వెంకటరమణనాయుడు ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను గడగమ్మ పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించినప్పుడు వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లను బయటకు గెంటేసి కూటమి ఏజెంట్లు, నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ఎన్నికల సంఘానికి తాను ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.తక్షణమే గడగమ్మలో జరిగిన పోలింగ్‌ విధానంపై కలెక్టర్‌ సీసీ కెమెరాలు తనిఖీ చేసి నిజానిజాలను చేల్చి ఈ పోలింగ్‌ కేంద్రంలో రీ–పోలింగ్‌ నిర్వహించాలని కోరారు. ఆయనతో పాటు విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు కళింగ ప్రేమభూషణరావు సమావేశంలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement