రూ.4లక్షల కోట్ల అప్పులు ఎవరి కోసం? | - | Sakshi
Sakshi News home page

రూ.4లక్షల కోట్ల అప్పులు ఎవరి కోసం?

Nov 4 2026 2:26 AM | Updated on Nov 4 2026 2:26 AM

చీపురుపల్లి: చంద్రబాబు ప్రభుత్వం రెండున్నరేళ్లలో రూ.4లక్షల కోట్లు అప్పుచేసింది.. ప్రజాసంక్షేమం, అభివృద్ధికి ఖర్చుచేయకుండా ఈ డబ్బులు ఏం చేసినట్టు... ఎవరికి దోచిపెట్టినట్టు.. టీడీపీ నీకెంత నాకెంత పాలన పోవాలన్నా... పేదలు గుర్తుకు రావాలన్నా ఓటు మార్చండి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి చంద్రబాబుకు కళ్లు తెరిపించండి అంటూ శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఓటర్లను కోరారు. ఎన్నికల ప్రచారంలో ఆఖరి రోజైన మంగళవారం చీపురుపల్లి పట్టణంలోని మూడు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా హామీలు అమలు చేయలేదన్నారు. అందుకనే ఈ నెల 5న జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సిపి అభ్యర్థులను గెలిపించి చంద్రబాబుకు తగిన బుద్ధిచెప్పాలన్నారు. మూడేళ్లలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దుర్మార్గాలు, అన్యాయాలను వ్యతిరేకించాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలవాలన్నారు. జిల్లాలో అన్ని చోట్లా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించుకున్నప్పుడే ఇక్కడున్న ఎమ్మెల్యేలు చంద్రబాబు దగ్గరకు వెళ/్ల టీడీపీ సినిమా అయిపోయిందని చెబుతారన్నారు. డ్వాక్రా మహిళల కోసం మహానేత వైఎస్సార్‌ పావలా వడ్డీ పథకాన్ని అమలు చేశారని, మరొకడగు ముందుకేసిన జగన్‌మోహన్‌రెడ్డి సున్నా వడ్డీ పథకాన్ని తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మూడేళ్లలో ఒక్క రూపాయి వడ్డీ కూడా మహిళలకు తిరిగి ఇచ్చిందా చెప్పాలని ప్రశ్నించారు. రూ.4 లక్షలు కోట్లు అప్పులు తీసుకొచ్చింది ఎవరి కోసమో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేవలం దోపిడీ కోసమే అప్పులు తెస్తున్నారన్నారు. నిత్యావసర సరుకులు ధరలు ఆకాశానికి పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం కనీసం స్పందించని దుస్థితి నెలకొందన్నారు.

వ్యాపారులు ఆలోచన చేయాలి

రెండు దశాబ్దాల తమ పరిపాలనలో వ్యాపారులకు ఎప్పుడైనా ఇబ్బందులు కలిగాయా లేదో ఆలోచన చేయాలని బొత్స కోరారు. టీడీపీ హయాంలో ఎన్ని అవస్థలు పడుతున్నారో గుర్తుచేసుకోవాలన్నారు.

పరిపాలన అంతా పోలీస్‌ స్టేషన్‌లోనే...

సాధారణంగా పరిపాలన తహసీల్దార్‌, ఎంపీడీఓ కార్యాలయాల్లో జరుగుతుందని, కానీ టీడీపీ ప్రభుత్వంలో పోలీస్‌స్టేషన్‌లో పరిపాలన జరుగుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. ఏ తప్పు చేయని వారిపై కేసులు నమోదు చేసి హింసించి, భయపెట్టి పరిపాలన సాగిస్తుండడం అన్యాయమన్నారు. పేదలు తమ పనుల కోసం చేతులు తడపాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఇలాంటి దుర్భరమైన సందర్భాలు నుంచి బయిటపడాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. ఎంపీటీసీలలో పాటు చీపురుపల్లి జెడ్పీటీసీగా బెల్లాన వంశీకృష్ణను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌, మాజీ ఎంపీపీ ఇప్పిలి వెంకటనర్శమ్మ, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, పార్టీ మండలాధ్యక్షుడు మీసాల వరహాలనాయుడు, జెడ్పీటీసీ అభ్యర్థి బెల్లాన వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఇప్పిలి వెంకటనర్శమ్మ, అనంతం దంపతుల ఆధ్వర్యంలో వారి నివాసం నుంచి బయిలుదేరిన ర్యాలీ లావేరురోడ్‌, కొత్త గవిడివీధి, శివరాం రోడ్‌, మెయిన్‌రోడ్‌ మీదుగా మూడు రోడ్ల కూడలి వరకు సాగింది.

అప్పుల బాబుకు ఓటుతో

కళ్లుతెరిపించండి

టీడీపీది నీకెంత నాకెంత పాలన

పేదలు గుర్తుకు రావాలంటే ఓటు

మార్చండి

30 ఏళ్లుగా నిస్వార్థ సేవలు అందించాను

నమ్మితే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు

మద్దతు ఇవ్వండి

శాసనమండలి విపక్ష నేత

బొత్స సత్యనారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement