చిన్న శ్రీనుకు పెద్ద షాక్‌ | - | Sakshi
Sakshi News home page

చిన్న శ్రీనుకు పెద్ద షాక్‌

Nov 4 2026 2:26 AM | Updated on Nov 4 2026 2:26 AM

● వాస్తవానికి ఓసీ కులానికి చెందిన రమేష్‌ కుమార్‌జైన్‌కు జన్మించిన ముస్కాన్‌ జైన్‌ను 2021లో బీసీ–డీ సామాజిక వర్గానికి చెందిన మజ్జి శ్రీనివాసరావు దత్తత తీసుకున్నారు. ఆ తరువాత మజ్జి సిరిసహస్రగా పేరు మార్చి బీసీ–డిగా ధ్రువీకరిస్తూ అప్పటి విజయనగరం తహసీల్దార్‌ కులధ్రువీకరణ పత్రాన్ని జారీ చేశారు. కేవలం దత్తత తీసుకున్నంత మాత్రాన ఒక వ్యక్తికి ఆ కుటుంబానికి సంబంధించిన కులధ్రువీకరణ పత్రం పొందే అర్హత వస్తుందా? రిజర్వేషన్‌ ప్రయోజనాలు పొందవచ్చా? అనే అంశంపై వివాదం ఏర్పడింది. ఈ విషయం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు దృష్టికి వెళ్లింది. ఇరు పక్షాల వాదనలు విన్న గౌరవ హైకోర్టు, దత్తత ఆధారంగా ఒక వ్యక్తి మరో సామాజికవర్గానికి చెందిన వారిగా గుర్తింపు పొందవచ్చా లేదా అనే విషయాన్ని అధికారులు పూర్తిగా పరిశీలించాలని స్పష్టం చేసింది. దత్తత తీసుకున్న కుటుంబం, పుట్టిన కుటుంబం యొక్క ఆచారాలు, సంప్రదాయాలు, ఇతర పరిస్థితులనుకూడా పరిశీలించాలని పేర్కొంది. ఈ కుల ధ్రువీకరణ పత్రంపై వచ్చిన ఫిర్యాదును, దానిపై కోరిన మధ్యంతర ఉపశమనాన్ని కూడా హైకోర్టు ఉత్తర్వుల కాపీ అందిన తేదీ నుంచి ఒక వారంలోపు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. అలాగే, జెడ్పీటీసీ అభ్యర్థిగా బీసీ వర్గం కేటగిరీలో చెల్లించిన రూ.3 వేలకు అదనంగా ఓసీ కేటగిరీలోనే రూ.3 వేలు రిటర్నింగ్‌ అధికారికి చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.

సాక్షిప్రతినిధి విజయనగరం:

ముస్కాన్‌ జైన్‌ అనే ఓసీ సామాజిక వర్గానికి చెందిన తన దత్తత కుమార్తెను సిరిసహస్రగా పేరుమార్చి బీసీగా చూపించి రాజకీయ లబ్ధికోసం స్కెచ్‌లు వేసిన జెడ్పీ మాజీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఎత్తులకు హైకోర్టు బ్రేక్‌లు వేసి పెద్ద షాకే ఇచ్చింది. జిల్లాలోని పరిషత్‌ ఎన్నికల్లో భాగంగా తెర్లాం, కొత్తవలస జెడ్పీటీసీ స్థానాలు అన్‌రిజర్వ్‌డ్‌కు కేటాయించిన విషయం విధితమే. అయితే, ఓసీ వర్గానికి చెందిన ముస్కాన్‌ జైన్‌ అలియాస్‌ సిరిసహస్ర బీసీ వర్గాలకు నిర్దేశించిన విధంగానే నామినేషన్‌ పత్రాలతో పాటు రూ.3,000 డిపాజిట్‌ రుసుం చెల్లించారు. వాస్తవానికి ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఓసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు రూ. 6,000 చెల్లించాల్సి ఉంది. దీంతో పాటు ఆమె కులధ్రువీకరణపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు హెకోర్టును ఆశ్రయించారు. వాదోపవాదనలను పరిశీలించిన తరువాత కలెక్టర్‌కు వారంలోగా నివేదిక ఇవ్వాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా రిజర్వేషన్‌లు అనేవి సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ ప్రయోజనాలు నిజంగా అర్హులైన వారికే అందాలి. అర్హత లేని వారు రిజర్వేషన్‌ ప్రయోజనాలను పొందకుండా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అని వాఖ్యానించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement