నేలబారు చదువులు.. భోజనానికి ఫీట్లు..! | - | Sakshi
Sakshi News home page

నేలబారు చదువులు.. భోజనానికి ఫీట్లు..!

Nov 4 2026 2:26 AM | Updated on Nov 4 2026 2:26 AM

రామభద్రపురం: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్కారు బడుల్లో సదుపాయాల కల్పనకు మంగళం పాడేసింది. పేద, మధ్యతరగతి కుటుంబాలు చదువుకునే ఊరి బడిని పట్టించుకోవడం మానేసింది. గత ప్రభుత్వం తలపెట్టిన ‘మనబడి నాడు–నేడు’ పనులను అసంపూర్తిగా వదిలేసింది. దీంతో విద్యార్థులు అసౌకర్యాల నడుమ చదువులు సాగిస్తున్నారు. చాలా పాఠశాలల్లో నేలపైనే కూర్చొని పాఠాలు వింటున్నారు. భోజన శాలలు లేక ఆరుబయట మైదానంలోను, పాఠశాల వరండాల్లో భోజనాలు చేస్తున్నారు. ఇంటి వద్ద నుంచే భోజనం పల్లాలను ప్రతిరోజూ మోస్తున్నారు. పేద కుటుంబాల పిల్లల చదువుపై చంద్రబాబు సర్కారు కర్కశత్వంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు సుమారు 1.10 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అధిక మంది విద్యార్థులు ఇంటివద్ద నుంచి తెచ్చుకున్న పల్లెంలోనే భోజనం చేస్తున్నారు. పాఠశాలల్లో భోజన శాలలు లేకపోవడంతో విద్యార్థులకు పల్లాలు మోత తప్పడం లేదు. మరోవైపు రాగిజావను సైతం ప్లేటులోనే పట్టి తాగుతున్నారు. గత వైస్సార్‌సీపీ ప్రభుత్వంలో దాతలు స్పందించి విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. ఐదేళ్లలో అవి పాడైపోవడంతో ఇప్పుడు ఇంటి వద్ద నుంచి పుస్తకాలతో పాటు బ్యాగులో పల్లెం పెట్టుకుని తెచ్చుకుంటున్నామని విదార్థులు చెబుతున్నారు.

చిత్రంలో నేలపై కూర్చొని పాఠ్యాంశం వింటున్నది రామభక్షదపురం ప్రభుత్వ ఉన్నతపాఠశాల విద్యార్థులు. ఇక్కడ ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి సుమారు 35 మంది ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. విద్యార్థులు కూర్చొనేందుకు ఏ తరగతి గదిలోనూ బెంచీలు లేవు. రోజంతా నేలపై కూర్చొనే పాఠాలు వింటున్నామంటూ విద్యార్థులు గోడువినిపిస్తున్నా పాలకులకు కనీసం పట్టడంలేదు.

రామభద్రపురం ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం క్యూ కట్టిన విద్యార్థులు

బ్యాగుతో పాటు ఇంటి వద్ద నుంచి తెచ్చుకుంటున్న పల్లాలను చూపిస్తున్న

రామభద్రపురంలోని చొక్కాపు వీధి ప్రాథమిక పాఠశాల పిల్లలు

ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు మొగ్గుచూపని చంద్రబాబు సర్కారు

ఊరిబడిలో సదుపాయాలు కరువు

నేలపైనే చదువులు, భోజనాలు

ఆవేదనలో చిన్నారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement