ముగిసిన పుర ఓట్ల లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన పుర ఓట్ల లెక్కింపు

Nov 4 2026 2:26 AM | Updated on Nov 4 2026 2:26 AM

విజయనగరం అర్బన్‌:

మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రలోభాలకు తెర తీసింది. నయానో భయానో ఓటర్లను తమ దారిలోకి తెచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. దీని ఫలితంగానే మెజార్టీ స్థానాలు దక్కించుకోగలిగింది. దీనికి తోడు పోలింగ్‌ ఉదయం నుంచి మందకొడిగా సాగినా.. చివరి నిమిషాల్లో అమాంతం పెరగడంపైనా అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటి ఫలితమే.. మంగళవారం ప్రకటించిన ఎన్నికల ఫలితాలు కూటమి పార్టీలకు అనుకూలంగా రావడానికి కారణమని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్ని కుట్రలకు తెర తీసినా... కొన్నిచోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు బలమైన పోటీ ఇచ్చారు. విజయనగరం కార్పొరేషన్‌ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి అవనాపు భార్గవి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోలగట్ల శ్రావణిపై 18,407 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఐదు రౌండ్లలో భార్గవికి 75,694 ఓట్లు రాగా, శ్రావణికి 57,287 ఓట్లు లభించాయి. అలాగే, బొబ్బిలి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా టీడీపీకి చెందిన రాంబార్కి రేణుకాదేవి స్వప్న తన సమీప ప్రత్యర్థి, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తూముల అచ్యుతవల్లిపై 5,184 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నెల్లిమర్ల నగరపంచాయతీ చైర్మన్‌గా స్వతంత్ర అభ్యర్థి లెంక అప్పలనాయుడు విజేతగా నిలిచారు.

విజయనగరం

కార్పొరేషన్‌,

బొబ్బిలిలో టీడీపీ

అభ్యర్థులు విజయం

నెల్లిమర్లలో విజేతగా నిలిచిన స్వతంత్ర

అభ్యర్థి

ఫలించిన అధికారపార్టీ ప్రలోభాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement