ముగిసిన ‘స్థానిక’ ప్రచారం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ‘స్థానిక’ ప్రచారం

Nov 4 2026 2:26 AM | Updated on Nov 4 2026 2:26 AM

విజయనగరం రూరల్‌: జిల్లాలో పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ప్రచారపర్వం మంగళవారంతో ముగిసింది. జిల్లాలో 27 జెడ్పీటీసీ స్థానాలకు, 438 ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు మంగళవారం రాత్రి నుంచే ఓటర్లను ప్రలోభాలతో ప్రసణ్ణం చేసుకునే పనిలో పడ్డారు. అధికార కూటమి పార్టీ అభ్యర్థులు అనేక గ్రామాల్లో ఓటర్లకు నగదు, బహుమతులు, బియ్యం బస్తాలు ఇంటింటికీ వెళ్లి అందజేస్తున్నారు. తాయిలాల పంపిణీలో అధికార పార్టీ నేతలు మంగళవారం సాయంత్రం ప్రచారం గడువు ముగిసిన క్షణం నుంచే వారి అనుచరగణంతో ఓట ర్లను ప్రసణ్ణం చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల సామ, దామ, దండోపాయాలతో ఓటర్లను భయాందోళనకు గురిచేస్తున్నారు.

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత

విజయనగరం టౌన్‌: జిల్లాలోని విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌, బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలైన విజయనగరం రాజీవ్‌ స్టేడియం, నెల్లిమర్ల సీకేఎంజీజే కళాశాల వద్ద పోలీసుశాఖ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తుతో పాటూ పరిసర ప్రాంతాలను డ్రోన్స్‌, సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించామన్నారు. ఆయన వెంట అదనపు ఎస్పీ పి.కిరణ్‌ కుమార్‌, విజయనగరం డీఎస్పీ ఎస్‌.లక్ష్మణమూర్తి, సీఐలు, ఎస్‌ఐలు, ఇతర పోలీస్‌ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

ఎన్నికల విధులకు గైర్హాజరు

● 65 మంది ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు

● మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశం

సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో స్థానిక సంస్థల 2వ సాధారణ ఎన్నికల విధులకు గైర్హాజరైన వివిధ శాఖల ఉద్యోగులపై అధికార యంత్రాంగం కఠిన చర్యలు ఉపక్రమించింది. ఎన్నికల విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యం వహించిన మొత్తం 65 మంది ఉద్యోగులకు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. విధులకు ఎందుకు హాజరు కాలేదో తెపుతూ మూడు రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో ఆదేశించారు. పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీల పరిధిలో గ్రామ/ వార్డు సచివాలయ శాఖకు చెందిన 30 మంది ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, సంక్షేమ–విద్యా సహాయకులు ఎన్నికల విధులకు గైర్హాజరయ్యారు. విద్యాశాఖకు చెందిన స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీలు, హెచ్‌ఎంలు, క్రాఫ్ట్‌ ఇన్‌స్ట్రక్టర్లతో కూడిన 27 మంది ఉపాధ్యాయులు/సిబ్బంది విధులకు హాజరుకాలేదు. దీంతో పాటు సాలూరు మున్సిపాలిటీ పరిధిలో పోలింగ్‌ అధికారుల విధులు కేటాయించిన ఐసీడీఎస్‌ శాఖకు చెందిన 8 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు సైతం విధులకు గైర్హాజరైనట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు. ఎన్నికల విధుల్లో ఎటువంటి అలసత్వం ప్రదర్శించినా సహించేది లేదని, దీనిని అత్యంత అత్యవసరంగా పరిగణించాలని అధికారులను ఆయన హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement