అంతా మోసం.. ప్రతి మాట అబద్ధం..! | - | Sakshi
Sakshi News home page

అంతా మోసం.. ప్రతి మాట అబద్ధం..!

Nov 3 2026 2:27 AM | Updated on Nov 3 2026 2:27 AM

రాజాం: ‘బడుగుబలహీన వర్గాలకు చెందిన వారికి 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్‌... వలంటీర్లకు నెలకు రూ.10వేలు జీతం.. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3వేలు చొప్పున నిరుద్యోగ భృతి... ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 చొప్పున మహిళలకు ఆర్థిక లబ్ధి.. రైతన్నకు సాగుసాయం... పేదలందరికీ ఇళ్లు’.. అంటూ ప్రస్తుత సీఎం చంద్రబాబు, కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీలిచ్చారు. పల్లె, పట్టణ ప్రజలను నమ్మించారు. తీరా అధికారంలోకి వచ్చాక వీటిలో ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. రెండున్నరేళ్లుగా ఏ ఒక్క పథకమూ మంజూరుచేయలేదు. హామీలు నమ్మి ఓట్లేసిన జనాన్ని మోసం చేశారు. అబద్ధాలతో నిలువునా ముంచేశారు. చంద్రబాబును నమ్మి పోయాం మోసం అంటూ ఇప్పుడు ఓటర్లు ఆవేదన చెందుతున్నారు. స్థానిక ఎన్నికలవేళ గ్రామాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు ఇస్తున్న హామీలు వింటూ.. పార్టీ పెద్దలే హామీలు అమలుచేయకపోతే చిన్నచిన్న కార్యకర్తలు, నాయకుల మాటలు ఎలా నమ్ముతా మని బాహాటంగానే విమర్శిస్తున్నారు.

● అటకెక్కిన ఇంటివద్దకే బియ్యం పథకం

జిల్లా వ్యాప్తంగా 5,71,228 రేషన్‌ కార్డుదారులకు 430 ఎండీయూ వాహనాలతో ఇంటివద్దకే గత ప్రభుత్వం బియ్యం అందజేసేది. మరోవైపు వాహన డ్రైవర్లకు ఉపాధి కల్పించింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఎండీయూ వాహన వ్యవస్థను రద్దుచేయడంతో వందలాది మంది నిరుద్యోగులుగా మారారు. వారి కుటుంబాలకు ఉపాధి కరువైంది. మరోవైపు రేషన్‌ కోసం మళ్లీ పూర్వపు రోజులు పునరావృతమయ్యాయి. పనులు మానుకుని డిపోలకు పరుగుతీయాల్సి వస్తోంది.

● ఊరించి.. ఉసూరుమనిపించి

అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రెండున్నరేళ్లలో ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. జిల్లా వ్యాప్తంగా 7.50 లక్షల మంది అర్హులైన ఆడబిడ్డలను మోసం చేశారు.

ఆశపెట్టి మోసం చేశారు..

పార్టీలకు అతీతంగా గ్రామ, వార్డు వలంటీర్లకు నెలకు రూ.10 వేలు ఇస్తామని సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ప్రకటించారు. నిజమేనని నమ్మాం. తీరా అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవస్థను రద్దుచేసి ఉపాధిలేకుండా చేశారు. నిలువునా ముంచేశారు.

– రేగిడి రాజు, మాజీ గ్రామ వలంటీర్‌,

వాసుదేవపట్నం, సంతకవిటి మండలం

చంద్రబాబును నమ్మరాదు

చంద్రబాబును నమ్మరాదు. నిరుద్యోగులను నిలువునా ముంచేశారు. గత ప్రభుత్వం లక్షలాది సచివాలయ ఉద్యోగాలు భర్తీచేసింది. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఇస్తామన్న నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి అందజేయడంలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో డిగ్రీ పాసైనా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఇంత మోసకారి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు. – కడగల భీమేశ్వరరావు,

ఎమ్‌బీఏ, ఎల్‌ఎల్‌బీ, రాజాం

ఆడబిడ్డలకు కన్నీరు..

గత ప్రభుత్వం అడగకుండానే మహిళలకు సంక్షేమ పథకాలు అందజేసింది. ఆర్థిక కష్టాలను దూరం చేసింది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేయడంలేదు. ఆడబిడ్డ నిధి కింద ఇస్తామన్న రూ.1500 అందజేయడం లేదు. ఆసరా, చేయత పథకాలను అటకెక్కించారు. డ్వాక్రా వడ్డీ మాఫీ మాటే లేదు. ఈ ప్రభుత్వాన్ని ఏమని దూషించాలో తెలియడం లేదు. ఎన్నికల్లో జనం బుద్ధిచెప్పడం ఖాయం.

– ఎలిగింటి తేజేశ్వరి, సంకిలి, రేగిడి మండలం

ఉమ్మడి విజయనగరం జిల్లాలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ, వార్డు వలంటీర్‌ వ్యవస్థతో నిరుద్యోగ యువతకు కొంతమేర ఉపాధి లభించింది. జిల్లా వ్యాప్తంగా 10,200 మంది గ్రామ, వార్డు వలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ నెలకు రూ.5వేల గౌరవ వేతనంలో జీవనం సాగించేవారు. ఉత్తమ సేవలందిస్తూ సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులకు ఎంపికై నగదు ప్రోత్సాహకాలు అందుకునేవారు. వీరందరికీ చంద్రబాబు నెలకు రూ.10వేలు ఇస్తామని చెప్పి నమ్మించారు. తీరా అధికారంలోకి వచ్చాక వలంటీర్‌ వ్యవస్థను రద్దుచేసి అందరినీ రోడ్డున పడేశారు.

పెరుగుతున్న నిరుద్యోగిత..

గత జనగ్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి 1.60 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఈ ఉద్యోగ విప్లవంతో నిరుద్యోగులు ఉద్యోగులుగా మారడమే కాకుండా ఓ ఇంటివారయ్యారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. గత రెండున్నరేళ్లుగా సరైన ఉద్యోగనోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నా నిరాశే ఎదురవుతోంది. జిల్లాలో నిరుద్యోగ సమస్య పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయంలో 90 వేల మంది నిరుద్యోగులు నమోదుకాగా, అనధికారికంగా మరో 3 లక్షలు మంది ఉన్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతిని కూడా చంద్రబాబు ప్రభుత్వం చెల్లించకపోవడంతో అవస్థలు తప్పడంలేదు.

రూ.10వేలు అన్నారు..

పంగనామాలు పెట్టారు...

ఇచ్చిన హామీలు అమలుచేయని

చంద్రబాబు ప్రభుత్వం

వలంటీర్లకు నెలకు రూ.10వేలు ఇస్తామని వ్యవస్థనే రద్దు చేశారు..

ఆడబిడ్డ నిధి అందించేదెప్పుడు?

కొత్త పింఛన్లు లేవు.. నిరుద్యోగ భృతి అందదు..

ఉద్యోగ నోటిఫికేషన్లకు తప్పని

ఎదురుచూపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement