మడ్డువలసకు వరద పోటు | - | Sakshi
Sakshi News home page

మడ్డువలసకు వరద పోటు

Nov 3 2026 2:21 AM | Updated on Nov 3 2026 2:21 AM

వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టుకు వరదపోటు పెరిగింది. రెండు రోజుల కిందట వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో సోమవారం 7వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి ప్రాజెక్టుకు నీటి ప్రవాహం పెరగడంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు విడిచిపెడుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద 64.69 మీటర్ల మేర నీటిమట్టం నమోదైందని ఏఈ నితిన్‌ తెలిపారు.

పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండండి

విజయనగరం ఫోర్ట్‌: పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ ఎస్‌.జీవనరాణి తెలిపారు. నేషనల్‌ టొబొకో కంట్రోల్‌ ప్రొగ్రాంపై రూపొందించిన వాల్‌పోస్టర్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. పొగాకు ఉత్పత్తులను తినడం వల్ల కేన్సర్‌, పేగు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. జిల్లాలో 60 రోజుల పాటు టొబొకో ప్రీ యూత్‌ క్యాంప్‌ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో డీఎల్‌ఓ రాణి, రఘువంశి, తదితరులు పాల్గొన్నారు.

కూటమి ధర్మాన్ని పాటించరా?

● బీజేపీకి సీటు కేటాయిస్తే టీడీపీ అభ్యర్థి ఎలా పోటీచేస్తారు?

● విజయనగరం అశోక్‌ బంగ్లావద్ద

ఆందోళనకు దిగిన బీజేపీ కార్యకర్తలు

విజయనగరం రూరల్‌: పూసపాటిరేగ మండలం రెల్లివలస ఎంపీటీసీ స్థానాన్ని కూటమి సీట్ల సర్దుబాటులో బీజేపీకి కేటాయించారు. అయితే, అక్కడ టీడీపీ తరఫున మరో అభ్యర్థి బరిలో నిలిచారు. ఇదెక్కడి అన్యాయమని, తక్షణమే బీజేపీ అభ్యర్థికి పోటీగా ఉన్న రెబెల్‌ అభ్యర్థిని టీడీపీ నుంచి సస్పెండ్‌ చేయాలంటూ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పతివాడ రాజేష్‌, పార్టీ కార్యకర్తలు విజయనగరం టీడీపీ జిల్లా కార్యాలయమైన అశోక్‌ బంగ్లా వద్ద సోమవారం ధర్నా చేశారు. కూటమి సీట్ల సర్దుబాటు ధర్మాన్ని తాము పాటిస్తున్నా టీడీపీ అభ్యర్థులు పాటించడంలేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement