చంద్రబాబుది నయవంచన పాలన | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబుది నయవంచన పాలన

Nov 3 2026 2:21 AM | Updated on Nov 3 2026 2:21 AM

● చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించిన శాసన మండలి విపక్షనేత

బొత్స సత్యనారాయణ

గుర్ల: అబద్ధపు హామీలతో నమ్మించి పేద ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. గుర్ల మండలం పెద్దబంటుపల్లి, తెట్టంగి, కెల్లలో ఆయన సోమవారం ఎన్నికల ప్రచారం చేశారు. సంక్షేమ పథకాల అమలులో సర్కారు విఫలమైందన్నారు. రైతులకు ఎరువులు దొరకని దుస్థితి నెలకొందన్నారు. పార్టీలు మారిన వారి బెదిరింపులకు తలొగ్గద్దని, వైఎస్సార్‌సీపీలో ఉన్న ప్రతి నాయకుడు, కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. జెడ్పీటీసీ అభ్యర్థి సంగం రెడ్డి వెంకటలక్ష్మి మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చేసి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అడుగుజాడల్లో మనందరం నడుచుకుందామన్నారు. ప్రచారంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణ రాజు, పార్టీ మండలాధ్యక్షుడు పొట్నూరు సన్యాసినాయుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శీర అప్పలనాయుడు, వరదా ఈశ్వరరావు, బెల్లాన బంగారునాయుడు, కేసలి అప్పారావు, స్థానిక నాయకులు కంకణాల రమణయ్య, గెడ్డపు సతీష్‌, బూర్లె అప్పలస్వామి, తదితరులు పాల్గొన్నారు.

పెద్దబంటుపల్లి ఎన్నికల సభలో మాట్లాడుతున్న శాసనమండలి విపక్షనేతబొత్స సత్యనారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement