రెండున్నరేళ్లుగా.. రైతన్నకు కన్నీరు..! | - | Sakshi
Sakshi News home page

రెండున్నరేళ్లుగా.. రైతన్నకు కన్నీరు..!

Oct 31 2026 8:13 AM | Updated on Oct 31 2026 8:13 AM

విజయనగరం ఫోర్ట్‌:

ఆరుగాలం శ్రమించి అందరికీ అన్నంపెట్టే రైతన్నకు రెండున్నరేళ్లుగా గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. విపత్తుల సమయంలో ప్రభుత్వం ఆదుకుంటుందన్న భరోసా కరువైంది. తుఫాన్‌ వర్షాలకు పంటలు నష్టపోయి ఆర్థికంగా కుదేలవుతున్నా పరిహారం అందజేయకపోవడం రైతులను ఆవేదనకు గురిచేస్తోంది. విత్తనాలు కూడా ఉచితంగా అందజేయకపోవడం సాగుకు అవరోధంగా మారింది. ఒకదాని తర్వాత మరొక తుఫాన్‌ సంభవిస్తూ నడ్డివిరుస్తున్నా సర్కారు స్పందించకపోవడం కలచివేస్తోందని రైతులు చెబుతున్నారు. 2025 అక్టోబర్‌ నెలలో వచ్చిన మోంఽఽథా తుఫాన్‌ కారణంగా జిల్లాలో వరి, మొక్కజొన్న, చెరకు ఉలవ, పత్తి, శనగ, మినుము పంటలు 776.978 హెక్టార్ల మేర నష్టం వాటిల్లింది. ఇందుకు సంబంధించి వ్యవసాయ అధికారులు రూ.1.93 కోట్ల ఇన్‌పుడ్‌ సబ్సిడీ రైతులకు చెల్లించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే, ఇంతవరకు చంద్రబాబు రైతులకు నయా పైసా చెల్లించలేదు. పెసర పంట 0.214 హెక్టార్లు, చెరకు 0.699 హెక్టార్లు, ఉలవ పంట 1.012 హెక్టార్లు, క్కజొన్న 9.103 హెక్టార్లు, శనగ పంట 0.243 హెక్టార్లు , పత్తి పంట 7.523 హెక్టార్లు, మినుము 1.194 హెక్టార్లలోని పంటలకు నష్టం వాటిల్లింది.

● ముంచేసిన అర్నబ్‌

అర్నబ్‌ తుఫాన్‌ రైతుల శ్రమను ఊడ్చేసింది. జిల్లాలో సుమారు 2,483 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. వరి పంట 2,450 హెక్టార్లలో, మొక్కజొన్న 25, పత్తి 8 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ అధికారులు ప్రాధమికంగా అంచనా వేశారు. అదేవిధంగా 217 హెక్టార్లలో బొప్పాయి, అరటి , కూరగాయలు పంటలకు నష్టం వాటిల్లినట్టు నమోదుచేశారు. అయితే, అధికారులు నిర్ధారించినా పరిహారం అందుతుందన్న భరోసా ఇవ్వలేకపోతున్నారు. దీనికి రైతులు, వ్యవసాయంపై చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యధోరణే కారణమన్న వాదన వినిపిస్తోంది. ‘తెల్ల అన్నం ఎవరు తింటారు’ అంటూ వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖమంత్రి కావడం తమ దురుదృష్టకరంగా రైతులు భావిస్తున్నారు. గత ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం వెనుకంజ వేయడంతో చౌకగానే దళారులకు ధాన్యాన్ని విక్రయించారు. ఇప్పుడు 25 కిలోల బియ్యం మార్కెట్‌లో రూ.2,200 నుంచి రూ.2,500 పలుకుతోంది. ప్రభుత్వ తీరుతో రైతులకు నష్టం జరుగుతోందని, దళారులకు మేలు జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులకు అధిక మేలు జరిగిందంటే అది గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలోనేనని గుర్తుచేసుకుంటున్నారు. ఉచిత పంటల బీమా, ఠంచన్‌గా వైఎస్సార్‌ రైతు భరోసా, పంట నష్టపరిహారం చెల్లింపు, ఇన్‌పుట్‌ సబ్సిడీ, సకాలంలో రాయితీపై విత్తనాలు, సమృద్ధిగా ఎరువులు, పంటకు గిట్టుబాటు ధర, సాగుకు యంత్రసాయం ఇలా... రైతు ప్రయోజనకరమైన సేవలు గత ప్రభుత్వ హయాంలోనే అందాయని చెబుతున్నారు.

ఈ ఏడాది రైతులకు నష్టమే...

గత నెలలో బంగాళాఖాతంలో సంభవించిన తుఫాన్‌ వర్సాలు, నదులు ఉప్పొంగడంతో వరి, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 189.83 హెక్టార్లలో అరటి, బొప్పాయి. కూరగాయల పంటలు నాశనమయ్యాయి. అరటి 129.11 హెక్టార్లు, బొప్పాయి 57.72 హెక్టార్లు, కూరగాయల పంటలు 3 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్టు ఉద్యానశాఖ అధికారులు గుర్తించారు. సుమారు 5.69 కోట్లు వరకు పరిహారం చెల్లించాలని ప్రతిపాదనలు పంపించారు. బొబ్బిలి, చీపురుపల్లి, డెంకాడ, గంట్యాడ, గరివిడి, మెరకముడిదాం, నెల్లిమర్ల, పూసపాటిరేగ, రామభద్రపురం, రేగిడి ఆమదాలవలస, ఎస్‌.కోట, తెర్లాం, వంగర, సంతకవిటి మండలాల రైతులు ఎక్కువగా నష్టపోయినట్టు నిర్ధారించారు. కానీ పైసా పరిహారం అందలేదు.

తుఫాన్‌ల కారణంగా నష్టపోతున్న రైతులు

విపత్తుల సమయంలో పట్టించుకోని

చంద్రబాబు సర్కారు

పెట్టుబడి గల్లంతు.. అప్పుల ఊబిలో అన్నదాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement