చంద్రబాబుది దుర్మార్గపు పాలన | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబుది దుర్మార్గపు పాలన

Oct 31 2026 8:13 AM | Updated on Oct 31 2026 8:13 AM

విజయనగరం: అధికార మదం, డబ్బు ఆశ చూపించి, భయపెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకోసం చంద్రబాబు అండ్‌ కో ప్రయత్నించడం విచారకరమని ఏపీ శాసనమండలి విపక్షనేత బొత్స సత్యానారాయణ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతియుత, గౌరవప్రద, సంప్రదాయ బద్ధమైన విజయనగరం జిల్లాలో తుచ్చు, బెదిరింపు రాజకీయా లకు మద్దతు ఇవ్వొద్దని ప్రజలను కోరారు. ఈ నెల 5న విజయనగరం జిల్లా వ్యాప్తంగా జరగనున్న 27 జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులకు ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. పలు చోట్ల అధికారులు, అనధికారులు కలిసిపోయి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసే ఎంపీటీసీ అభ్యర్థులను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు.

అధికార పార్టీలో ఉన్నామన్న ధీమా ఉంటే పోటీ చేసి గెలుచుకోవాలే తప్ప నీచరాజకీయాలు చేయడం తగదన్నారు.

● మీరు నేర్పించిన సంస్కృతి ఇదేనా...?

పెద్ద పెద్ద మాటలు చెప్పే గవర్నర్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు, పార్టీ పెద్దగా ఇటువంటి సంస్కృతిపై సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్‌ చేశారు. ఇదేనా మీ పెద్దరికం?.. ఇదేనా మీ సంస్కృతి అంటూ నిలదీశారు. ఇలాంటి చర్యలే మీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నేర్పించారా అంటూ ఎద్దేవాచేశారు. సంప్రదాయాలు, గౌరవం పాటించి శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించుకుందామని హితవుపలికారు. మరో 100 ఏళ్ల పాటు మంచి సంస్కృతి కొనసాగేలా చూడలే తప్ప తుచ్చు రాజకీయాలు, బెదిరింపులకు తావివ్వొద్దని సూచించారు.

● తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చిన

అధికారులను వదిలేది లేదు

ఓసీలకు బీసీలుగా తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చిన తహసీల్దార్ల తీరుపై విచారణ జరిపించి చర్యలు తీసుకునేంత వరకు ఊరుకునేది లేదన్నారు. తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చిన వారి సంగతి తేలుస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం శాశ్వతం కాదని, న్యాయ స్థానాలను ఆశ్రయించి అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు పోలీసుల జులం, అధికార మదం, ధన బలంతో ఎన్నికలు నిర్వహించడం దారుణమన్నారు. తప్పుడు పనులు చేసిన అధికారులు వారి మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని, భగవంతుడు అటువంటి అధికారులను ఎట్టి పరిస్థితుల్లో క్షమించడని అన్నారు.

జిల్లాలో దుష్ట సంస్కృతికి తెరలేపొద్దని, అలాంటి రాజకీయాలు చేస్తే తగిన మూల్యం చెల్లించకోకతప్పదని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీల నామినేషన్‌ పరిశీలన ప్రక్రియల అధికారుల తీరు ఆక్షేపణీయంగా ఉందన్నారు. అభ్యర్థులు దాఖలు చేసిన బీఫారంలు ఎక్కడోపడిపోయాయన్న నేపఽంతో రాత్రి 10 గంటల వరకు అభ్యర్థుల జాబితాను ప్రకటించకపోవడంతో ఎన్నికల నిర్వహణ పట్ల అధికార యంత్రాంగం తీరు అర్ధమవుతోందన్నారు. పూసపాటిరేగ అభ్యర్థి విషయంలో తానే స్వయంగా ఆర్వోతో మాట్లాడితే పొంతనలేని సమాధానం చెప్పారని, ఇటువంటి అధికారులు ప్రభుత్వాలు శాశ్వతం కాదన్న విషయం గుర్తించుకోవాలన్నారు. తెర్లాం మండలంలోని ముగ్గురు ఎంపీటీసీలు, ఎల్‌.కోటలో ఒక ఎంపీటీసీ విషయంలో ఇలానే అధికారులు వ్యవహరించారని చెప్పారు. కొత్తవలసకు చెందిన మరో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని కారులో ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తే అప్రమత్తమై అడ్డుకుకోవడం జరిగిందన్నారు. విజయనగరం జిల్లాలో ఎన్నడూ ఇటువంటి ఘటనలు చూడలేదన్నారు.

దుష్ట రాజకీయాలకు తెరతీయొద్దు

చేతనైతే పోటీ చేసి ఎన్నికల్లో గెలవండి

దుష్ట సంస్కృతికి తగిన మూల్యం

చెల్లించుకోక తప్పదు

భయపెట్టి, సంతకాలు ఫోర్జరీచేసి నామినేషన్ల ఉపసంహరణా?

పెద్దపెద్ద మాటలు చెప్పే

అశోక్‌గజపతిరాజు మీ నాయకులకు ఇదే నేర్పించారా..?

శాసనమండలి విపక్షనేత

బొత్స సత్యనారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement