విజయనగరం | - | Sakshi
Sakshi News home page

విజయనగరం

Oct 31 2026 8:13 AM | Updated on Oct 31 2026 8:13 AM

న్యూస్‌రీల్‌

ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు బాలి ప్రకాష్‌. చీపురుపల్లి మండలం పత్తికాయవలస గ్రామం. 10 ఎకరాల్లో అరటి పంట సాగుచేశాడు. ఎకరాకు రూ.70 వేలు చొప్పున 10 ఎకరాలకు రూ.7 లక్షలు వరకు పెట్టుబడి పెట్టాడు. గత నెలలో తుఫాన్‌ కారణంగా 10 ఎకరాల్లో అరటి పంట దెబ్బతింది. రూ.20 లక్షలు పంట దిగుబడి రావాల్సి ఉంది. పంట దెబ్బతినడంతో రూ.20 లక్షల వరకు నష్ట పోయాడు. ప్రభుత్వం నుంచి ఇంతవరకు రూపాయి సాయం అందలేదు.

ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు సిరిపురం సూర్యనారాయణ. ఈయనది మెంటాడ మండలం పిట్టాడ గ్రామం. గత నెలలో సంభవించిన తుఫాన్‌ కారణంగా 2.2 ఎకరాల్లో అరటి పంట దెబ్బతింది. సుమారు రూ.1.50 లక్షల వరకు నష్టపోయాడు. ఇంతవరకు ఇతనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు.

శనివారం శ్రీ 31 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement