ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

Oct 31 2026 8:13 AM | Updated on Oct 31 2026 8:13 AM

● వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల అధికారి అనిల్‌ చంద్ర పునేఠా

విజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అఽధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి అనిల్‌చంద్ర పునేఠా ఆదేశించారు. ఎన్నికల వ్యవస్థపై ఓటర్లలో పూర్తివిశ్వాసం కల్పించేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. అమరావతి నుంచి స్థానిక, మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లు, భద్రత, కౌంటింగ్‌ తదితర అంశాలపై ఐజీ రాజకుమారి, కార్యదర్శి మల్లికార్జునతో కలిసి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సాధారణ, వ్యయ పరిశీలకులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచే సైలెంట్‌ పీరియడ్‌ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో విజయనగరం కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి, ఎన్నికల సాధారణ పరిశీలకుడు తేజ్‌ భరత్‌, వ్యయ పరిశీలకుడు ఎస్‌.వెంకటేష్‌, డీఆర్వో సీహెచ్‌.సత్తిబాబు, మున్సిపల్‌ కమిషనర్‌ బాలస్వామి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ లవరాజు పాల్గొన్నారు.

జిల్లా వ్యాప్తంగా 5,231 పోస్టల్‌ బ్యాలెట్లు

విజయనగరం రూరల్‌: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ ఓటుహక్కును శుక్రవారం పోస్టల్‌ బ్యాలెట్‌ రూపంలో వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లో మొత్తం 5,231 పోస్టల్‌ బ్యాలెట్లు పోలయ్యా యి. ఉదయం 9:30 గంటల సమయానికి ప్రారంభమైన ఈ పోలింగ్‌ ప్రక్రియ క్రమక్రమంగా ఊపందుకుంది. ఓటింగ్‌ ప్రక్రియను ఆర్వోలు పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement