పూసపాటిరేగ: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే ప్రజా సంక్షేమం, అభివృద్ధి జరిగిందని పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గ నాయకుడు బొత్స లక్ష్మణరావు అన్నారు. పూసపాటిరేగ మండలం కనిమెల్ల, కామవరం, అల్లాడపాలెం, కందివలస, కనిమెట్ట గ్రామాల్లో పూసపాటిరేగ వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి మహంతి శివ, ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్‌గుర్తుపై ఓటేసి జెడ్పీటీసీతోపాటు 21 మంది ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు పతివాడ అప్పలనాయుడు, బర్రి చినఅప్పన్న, అల్లాడ రమేష్, నడిపేన రమణ, గుజ్జు సురేష్‌రెడ్డి, పడాల శ్రీధర్, కొత్తకోట శ్రీరాములు, శంకాబత్తుల సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.


