విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు. నగరంలోని 8, 34 డివిజన్ల కార్పొరేట్ అభ్యర్థులతో కలిసి మేయర్ అభ్యర్థి కోలగట్ల శ్రావణి శుక్రవారంఇంటింటి ప్రచారం చేశారు. బాలాజీ మార్కెట్లో మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి వీరికి మద్దతు తెలిపారు. రెండు బ్యాలెట్లలో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఆశీర్వదించాలని, నగరాన్ని మరింత అభివృద్ధిచేస్తామని శ్రావణి
తెలిపారు. – విజయనగరం


