టీడీపీకి రాంరాం..! | - | Sakshi
Sakshi News home page

టీడీపీకి రాంరాం..!

Oct 30 2026 7:36 AM | Updated on Oct 30 2026 7:36 AM

టీడీపీకి రాంరాం..!

● వైఎస్సార్‌సీపీలో చేరిన 100 కుటుంబాలు

● కండువాలు కప్పి ఆహ్వానించిన శంబంగి

బొబ్బిలి: మండలంలోని అలజంగి గ్రామానికి చెందిన వంద కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్‌ సీపీలోకి చేరాయి. ఈ మేరకు బుధవారం పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆ గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ సీనియర్‌నాయకులు శీర తిరుపతి నాయుడు, అల్లు త్రినాథ,పైల చిన్నం నాయుడుల ఆధ్వర్యంలో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆ గ్రామ వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి పూడి చిన్నకు మద్దతుగా ఈ చేరికలు జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన పైల వెంకట రమణ,పైల శ్రీరాం, ఈశ్వర రావు, వేణు, బెవర త్రినాథ, బెవర శివున్నాయుడు, సువ్వాడ రామకృష్ణ, ముల్లు అప్పలనాయుడు తదితర నాయకులు టీడీపీని వీడి తమ కుటుంబాలతో వైఎస్సార్‌సీపీలో చేరగా వారికి వైఎస్సార్‌సీపీ బొబ్బిలి నియోజక వర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కండువాలు వేసి వైఎస్సార్‌ సీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పదవీ కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, అమలు చేసిన ప్రజాసంక్షేమ పథకాలను వివరించారు. మీరంతా పార్టీలో చేరడంతో పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఎస్వీ మురళీ కృష్ణారావు, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రచార కార్యదర్శి బొద్దల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

బాలేరులో 45 కుటుంబాల చేరిక

భామిని: మండలంలోని బాలేరులో టీడీపీ నుంచి 45 కుటుంబాలు గురువారం వైఎస్సాఆర్‌సీపీలో చేరాయని వైఎస్సార్‌సీపీ నాయకులు కొత్తకోట చంద్రశేఖర్‌, మేడిబోయిన చలపతిలు తెలిపారు.టీడీపీ నాయకులు గొర్లె ఆదినారాయణ, గొర్లె ప్రహ్లాద్‌లతో పాటు 45 కుటుంబాలు ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరగా వారికి పార్టీ నాయకులు కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కొత్తకోట ఆంజనేయులు, జామి ప్రభాకర్‌, దామోదర కంఠయ్య, కిల్లారి చంటి ఉన్నారు.

నెల్లిమర్లలో 30 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరిక

నెల్లిమర్ల: పట్టణంలోని 11వ వార్డులో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి 30కుటుంబాలు చేరాయి. గతంలో ఇదే వార్డులో టీడీపీ కౌన్సిలర్‌గా పోటీచేసి ఓడిపోయిన ఈపు బాబ్జీ, మీనాక్షి దంపతులు గురువారం ఎంఎల్‌సీ పీవీవీ సూర్య నారాయణరాజు (సురేష్‌ బాబు), నియోజక వర్గ సమన్వయ కర్త గదల సన్యాసి నాయుడు, జిల్లా యువజన నాయకుడు బొత్స చైతన్య ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారితో పాటు 30 కుటుంబాల వారు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్‌ అభ్యర్థి సముద్రపు రామారావు, కౌన్సిలర్‌ అభ్యర్థులు బూర సుజాత, బూర పూజ, బూర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement