● మూసుకోని జలాశయం రెండో నంబర్ గేటు
● ఒక్క గేటు నుంచి 5 వేల క్యూసెక్కుల నీరు విడుదల
● పరిశీలించిన కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
పాచిపెంట: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో పెద్దగెడ్డ జలాశయానికి భారీగా వరద నీరు చేరగా..వర్షాలు తగ్గుముఖం పట్టినా గేటు మొరాయించడంతో నీటి విడుదల కొనసాగుతోంది. తుఫాన్‌న్ సమయంలో జలాశయానికి 6 వేల క్యూసెక్కుల ఇనన్‌ఫ్లో నమోదు కావడంతో అధికారులు మూడు గేట్ల ద్వారా అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ఇనన్‌ఫ్లో 1,300 క్యూసెక్కులకు తగ్గడంతో మూడు గేట్లను మూసివేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే రెండు గేట్లు మాత్రమే మూసుకుపోగా, రెండో నంబర్ గేటు మొరాయించింది. దీంతో ఆ ఒక్క గేటు ద్వారానే సుమారు 5 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది.
జలాశయాన్ని పరిశీలించిన కలెక్టర్..
ఈ విషయం తెలుసుకున్న పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్‌న్. ప్రభాకర్‌రెడ్డి, సబ్ కలెక్టర్ సచిన్ అచ్యుత్ రహార్‌తో కలిసి పెద్దగెడ్డ జలాశయాన్ని గురువారం సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. గేటు మొరాయించడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకుని, సమస్య పరిష్కారానికి తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ అర్నబ్ తుఫాన్‌న్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, జిల్లాలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. రైతులను ముందుగానే అప్రమత్తం చేశామన్నారు. తుఫాన్‌న్ కారణంగా పంటలు నష్టపోయిన రైతుల వివరాల నమోదుకు ప్రత్యేక క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేశామని చెప్పారు. రైతులు తమ పంట నష్టం వివరాలను అందులో నమోదు చేస్తే అధికారులు పరిశీలించి తగిన చర్యలు చేపడతారన్నారు. తుఫాన్‌్ సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ అధికారులు కృషి చేశారని ప్రశంసించారు.
పారిశుధ్య లోపంపై అసంతృప్తి
పాచిపెంటలో పారిశుధ్య నిర్వహణ తీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న రహదారులను గుర్తించి మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.


