మీ మేనకోడలిని గెలిపించండి | - | Sakshi
Sakshi News home page

మీ మేనకోడలిని గెలిపించండి

Oct 30 2026 7:36 AM | Updated on Oct 30 2026 7:36 AM

మీ మేనకోడలిని గెలిపించండి

విజయనగరం: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు మంచి చేస్తారో..ఎవరికి పాలన చేసే అర్హత ఉందో అటుంటి అభ్యర్థులను చూసి గెలిపించాలని ఏపీ శాసనసభా మాజీ డిప్యూటీ స్పీకర్‌, వైఎస్సార్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గడిచిన వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన విజయనగరం నగర అభివృద్ధిని, ప్రత్యేకంగా ధర్మపురి గ్రామానికి చేసిన మార్చిపోవద్దని కోరారు. అందరూ అన్నయ్య అంటూ పిలిచే నా కుమార్తె కోలగట్ల శ్రావణి మేయర్‌ అభ్యర్థినిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోందని మీ మేనకోడలితో పాటు స్థానిక కార్పొరేటర్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పతివాడ గణపతిని నిండు మనస్సుతో ఓటు రూపంలో ఆశీర్వదించాలని అభ్యర్థించారు. విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో భాగంగా గురువారం సాయంత్రం నగరంలోని ధర్మపురి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు మేయర్‌ అభ్యర్థి, స్థాఽనిక కార్పొరేటర్‌ అభ్యర్థికి స్థానిక ప్రజలు నుదుట కుంకుమ దిద్ది, పూలమాలలతో సత్కరించారు. అనంతరం జరిగిన ప్రచార సభలో కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ మొదటి పాలకవర్గంగా విజయనగరాన్ని పాలించిన వైఎస్సార్‌సీపీ 5 ఏళ్ల పాలనలో ధర్మపురిలో చేసిన అభివృద్ధిని ప్రజలంతా గుర్తుంచుకోవాలని కోరారు. మంచి చేసిన వారిని మర్చిపోవద్దన్నారు. విజయనగరం కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీకి బలమున్న ప్రాంతం ధర్మపురి అని గడిచిన 5 ఏళ్లలో సందు సందుల్లో నిర్మించిన రోడ్లు, ఉప్పు నీటి సమస్య పరిష్కారానికి నిర్మించిన నూతన వాటర్‌ ట్యాంక్‌లను మర్చిపోవద్దని గుర్తు చేశారు. ఈనెల 1న జరగనున్న కార్పొరేషన్‌ ఎన్నికల్లో తమ రెండ్లు ఓట్లను ప్రతి ఓటరు ఫ్యాన్‌ గుర్తుపై వేసి గెలిపించి కూటమి నిరంకుశ కూటమి ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ విజయనగరం కార్పొరేషన్‌ మేయర్‌ అభ్యర్థి కోలగట్ల శ్రావణి, మాజీ మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి, కార్పొరేషన్‌ ఎన్నికల పరిశీలకుడు అంధవరపు సూరిబాబు, స్థానిక కార్పొరేటర్‌ అభ్యర్థి పతివాడ గణపతి మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు పాల్గొన్నారు.

చేసిన మంచిని మర్చిపోవద్దు

శ్రావణిని అశీర్వదించండి

స్థానిక కార్పొరేటర్‌ అభ్యర్థిని గెలిపించండి

ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement