పాము కాటుతో హోం గార్డు మృతి | - | Sakshi
Sakshi News home page

పాము కాటుతో హోం గార్డు మృతి

Oct 30 2026 7:36 AM | Updated on Oct 30 2026 7:36 AM

గుర్ల: మండలంలోని భూపాలపురం గ్రామానికి చెందిన సుంకరి రాము (46) పాముకాటుతో గురువారం మృతి చెందాడు.ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన సుంకరి రాము పోలీస్‌ బాంబ్‌ స్కాడ్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో భాగంగా వరి పంటలో నీరు తొలగించడానికి వెళ్లాడు. వరి పంట పొలంలో నీరు తొలగిస్తుండగా పాము కాటు వేసింది. ఈ సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు పొలం దగ్గరికి వెళ్లేటప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం మేరకు గుర్ల ఎస్సై పి.నారాయణ రావు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య చిన్నతల్లి, కుమార్తె సాయి ప్రశాంతి, కుమారుడు సాయి గోపాల్‌ ఉన్నారు.

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి..

బొబ్బిలి రూరల్‌: మండలంలోని దిబ్బగుడ్డివలస రైల్వే గేటు సమీపంలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఆర్‌పీఎఫ్‌ హెచ్‌సీ ఈశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం గురువారం సాయంత్రం రైల్వే గేటు సమీపంలో రైల్వే ట్రాక్‌పై మొండెం, తల వేరై ఉన్న సుమారు 50 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి మృతదేహం లభ్యమైందని తెలిపారు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించక పోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా పరిగణించి కేసు నమోదు చేశామని, తగిన ఆధారాలతో మృతుడి ఆచూకీ తెలిసిన వారు తమను సంప్రదించాలని కోరారు. వివరాల కోసం ఫోన్‌ 83099 01038నంబర్‌ను సంప్రదించి వివరాలను తెలియజేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement