మెరకముడిదాం: మండలంలోని ఇప్పలవలస గ్రామానికి చెందిన ఎనర్జీ అసిస్టెంట్ విద్యుత్‌షాక్‌కు గురై తీవ్రగాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలో వర్షాల కారణంగా మరమ్మతుల బారిన పడిన విద్యుత్‌లైన్లను సరిచేస్తున్న సమయంలో ఇప్పలవలస ఎనర్జీఅసిస్టెంట్ దాలిగోపాల్ విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. విద్యుత్‌స్తంభంపైన మరమ్మతులు చేస్తుండగా విద్యుత్‌షాక్ తగలడంతో విద్యుత్ స్తంభంపైన వేలాడుతూ ఉండిపోయాడు. ఈ విషయం గమనించిన మిగిలిన విద్యుత్‌శాఖ సిబ్బంది హుటాహుటిన క్రేన్ సహయంతో విద్యుత్ స్తంభంపై షాక్‌కు గురైన గోపాల్‌ను కిందికి దించి వెంటనే చీపురుపల్లి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్యసిబ్బంది వెంటనే స్పందించి చికిత్సను అందించడంతో తీవ్రగాయాలతో ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డాడు. అయితే ఇంత జరిగినా అటు ఏపీఈపీడీసీఎల్ కానీ, ఇటు ఆర్‌ఈసీఎస్ అధికారులు కానీ ఎవ్వరూ పట్టించుకోలేదంటూ అతని కుటుంబసభ్యులు అరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఏపీడీపీఈసీఎల్ అధికారులు కానీ, ఆర్‌ఈసీఎస్ అధికారులు కానీ వెంటనే స్పంధించి బాధితుడికి సహాయాన్ని అందించాలని, లేకుంటే అందోళనకు దిగాల్సి ఉంటుదని మండలానికి చెందిన ఎనర్జీ అసిస్టెంట్లు హెచ్చరిస్తున్నారు.


